
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
పర్లాకిమిడి: మహిళలకు సుభధ్ర పథకం ప్రభుత్వం అందజేయడంతో వారి ఆర్ధిక, సామాజిక స్థితిగతులు మెరుగుపడతాయని, ప్రతి మహిళను లక్షాధిపతి చేయడమే ముఖ్యమంత్రి మోహన్ మఝి సర్కారు ఉద్దేశమని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. స్థానిక గజపతి స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుభధ్ర పథకం లబ్ధిదారులకు రెండో విడత రూ.5వేలు ప్రదానోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి బరంపురంలో నిర్వహించిన కార్యక్రమాన్ని స్క్రీన్‌పై వీక్షించారు. కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్పీ జితేంద్ర పండా, డీఆర్‌డీఏ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఇన్‌చార్జి ఫృథ్వీరాజ్ మండల్, పురపాలక ఈఓ లక్ష్మణ్ ముర్ము, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, డీసీఓ అర్చనా మంగరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా జానపద నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించారు. అలాగే ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో స్థానిక రాజావారి ప్యాలస్ యుటెక్ కంప్యూటర్స్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో మహిళలకు, విద్యార్థులకు నిర్వహించిన రంగవల్లులు, పిండివంటలు, వక్తృత్వ పోటీలలో విజేతలకు ముఖ్యఅతిథి ఇతిశ్రీ మహాపాత్రో, మానసీ పండా, పాయల్ పాత్రోలు బహుమతి ప్రదానం చేశారు.
జయపురంలో..
జయపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను పలు సంస్థలు, మహిళా సంఘాలు ఘనంగా జరుపుకున్నాయి. స్థానిక విక్రమదేవ్ విశ్వ విద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వర్సిటీ రిజిస్ట్రార్ మహేశ్వర నాయిక్ అధ్యక్షత వహించారు. విద్యారంగానికి ఎనలేని సేవలు అందిచిన స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ సుచిత్ర మిశ్రను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పోస్టు గ్రాడ్యుయేట్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో, ఎగ్జామినేషన్ కంట్రోలర్, రంజన్ కుమార్ పాత్రో, కళాశాల డిపార్ట్‌మెంట్ కౌన్సిల్ డైరెక్టర్ మహేశ్వర దురియ, హ్యూమన్ రిసోర్స్ డవలప్‌మెంట్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దేవదత్త ఇండోరియ, ఫైనాన్స్ కంప్ట్రోలర్ సచిన్ కుమార్ నాయిక్, భగవత్ ప్రసాద్ సింగ్,శ్రీమతి సుకాంతి సోయ్ తదితరులు పాల్గొన్నారు. జయపురం సహకార సమితి తరఫున ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ వారు స్థానిక టౌన్ హాలులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత తదితరులు పాల్గొన్నారు.
వినూత్న నిరసన
భువనేశ్వర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ విభిన్న రీతిలో నిరసన ప్రదర్శించింది. స్థానిక మాస్టర్ క్యాంటీన్ ప్రాంతంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ఈ దృశ్యం తారస పడింది. మండల మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శిబిరంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు నల్ల గుడ్డలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించారు. రాష్ట్రంలో మహిళల దయనీయ పరిస్థితికి ప్రతీకగా ఈ ప్రదర్శన చేపట్టారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్ర మహిళలు అణచివేతకు లోనై నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఓపీసీసీ చీఫ్ భక్త చరణ్ దాస్ అన్నారు. మహిళలకు రక్షణ, సాధికారత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ తర్వాత ఇప్పుడు మహిళలను మోసం చేస్తోందని ఆరోపించారు. నరేంద్ర – మోహన్ ప్రభుత్వ హయాంలో మహిళలపై అణచివేత హద్దులు దాటిందన్నారు.
నీలకంఠపూర్ గూడలో..
పర్లాకిమిడి: గుమ్మా బ్లాక్ నీలకంఠపూర్ గూడలో ప్రగతి మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ కేంద్ర వామపక్షనేత బాలచంద్ర షడంగి హాజరయ్యారు. మహిళలపై ఈనాటికీ హింస జరుగుతోందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు కేటాయింపులు తక్కువ జరుగుతున్నాయని, రాష్ట్ర బడ్జెట్‌లో ఏడాదికి పదివేల రూపాయల సుభద్ర పథకం కూడా అతి తక్కువ అని బాలచంద్ర షడంగి అన్నారు.
ప్రాంతీయ సహకార సంఘం ఆధ్వర్యంలో..
పర్లాకిమిడి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాకథాన్ 2025ను స్థానిక గజపతి ప్యాలెస్ నుంచి జిల్లా కోపరేటివ్ సొసైటీస్ అధికారి హారిహార శెఠి ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత, ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆయన కోరారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, మహిళా కో ఆపరేటివ్ సొసైటీస్ అధ్యక్షురాలు ఎ.పద్మాయరాజ్, రైతు సంఘం నాయకులు సూర్యనారాయణ పట్నాయిక్ తదితరులు పాల్గోన్నారు.
అన్ని రంగాల్లో రాణించాలి
రాయగడ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ టౌన్ హాల్‌లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్ర పండ, రాయగడ కళాశాల ప్రిన్సిపాల్ బబిలత షరఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment