
మహిళలకు గొడుగుల పంపిణీ
రాయగడ: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మహిళా వాకర్స్ క్లబ్ సభ్యులు శనివారం సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని కుటుంబ పొషణ చేసుకుంటున్న మహిళలకు గొడుగులను పంపిణీ చేశారు. ఎండలో పొట్ట కూటి కొసం వ్యాపారాలు చేసుకుంటున్న వారి ధీన పరిస్థితిని గమనించిన క్లబ్ సభ్యులు ఈ మేరకు వారికి అండగా నిలిచారు. క్లబ్ అధ్యక్షురాలు కొరాడ రజిత, కార్యదర్శి కొరాడ భారతి, కోశాధికారి గెంబలి స్వప్న పాల్గొన్నారు. మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అధ్యక్షురాలు రజిత తెలిపారు.
లోక్ అదాలత్‌లో
2,348 కేసుల పరిష్కారం
రాయగడ: స్థానిక సివిల్ కోర్టు ప్రాంగణలో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో కాసీపూర్, రాయగడ, బిసంకటక్, గుణుపూర్, పద్మపూర్, మునిగుడ కోర్టుల్లో కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న 2,348 కేసులు పరిష్కారమయ్యాయి. జల్లా జడ్జి సత్యనారాయణ షడంగి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 51,19,464 రూపాయలను జరిమానా కింద వసూలయ్యాయి. న్యాయవాదులు, లీగల్ సెల్ విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
రాయగడ: జిల్లాలోని చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల దేవ్‌పూర్ గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడిని బిసంకటక్ సమితి ముండాబలి గ్రామానికి చెందిన రాజా కౌసల్య (28) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీస్ స్టేషన్ ఐఐసీ ప్రసన్న కుమార్ బెహర, సబ్ ఇన్‌స్పెక్టర్ అశుతోస్ సాహులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ... రాజా తన బైక్‌లో స్వగ్రామం ముండాబలి నుంచి రాయగడకు వస్తున్న సమయంలొ దేవ్‌పూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఒక వాహనం బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో రాజా అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే ఢీకొన్న వాహనం ఆగకుండా వెళ్లిపొయింది. కేసు నమోదు చేసిన పోలీసులు వాహనం ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
యువకుని మృతదేహం స్వాధీనం
రాయగడ: గుర్తు తెలియని యువకుని మృతదేహాన్ని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలోని అండరాకంచ్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. లుండురుకోన కూడలి సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న యువకుని మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక మరేమైన కారణం ఉందనే విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు.

మహిళలకు గొడుగుల పంపిణీ

మహిళలకు గొడుగుల పంపిణీ

మహిళలకు గొడుగుల పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment