
జేకేపూర్‌లో వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు
రాయగడ: పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందిన జేకేపూర్‌లోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరం 49వ వార్షికోత్సవంతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు పొందూరు వెంకట ప్రదీప్ ఆచార్యులు, ఆంపొలు రంగనాథ ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం విశ్వక్సేన పూజ, హావాచనం, పరిషత్, రుత్విక్ వరుణ, మంపపావాహనం, అంకురారోపణ, విశేష పూజలు, నీరాజన మంత్రపుష్పం, మంగళాశాసనం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షులు పట్నాన గౌరీశంకరరావు, సభ్యులు ఎ.గిరిజా భాస్కరరావు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.

జేకేపూర్‌లో వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment