
వారసత్వ హోదా సన్నాహాలు
పూరీ రథయాత్రకు యునెస్కో
అటవీ శాఖ మహిళా గార్డులకు సత్కారం
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ రథ యాత్రకు యునెస్కో ఇంటాంజిబుల్ సాంస్కృతిక వారసత్వ గుర్తింపు పొందేందుకు సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు. రథ యాత్రకు యునెస్కో వారసత్వ హోదా కోసం పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆసక్తి కనబరిచినట్లు ఆయన తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి వార్షిక రథ యాత్ర దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ప్రపంచ ప్రఖ్యాత పూరీ రథ యాత్ర లేదా రథోత్సవంగా ప్రసిద్ధి. యునెస్కో ఇంటాంజిబుల్ సాంస్కృతిక వారసత్వ గుర్తింపు పొందే ప్రక్రియను శ్రీ జగన్నాథ ఆలయం పాలక వర్గం ఎస్‌జేటీఏ ప్రారంభించింది. ఈ గుర్తింపు కోసం త్వరలో నామినేషను దస్తావేజులు సమర్పించనున్నట్లు సీఏఓ వివరించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులతో ఈ విషయంపై చర్చించి వారి మద్దతు కోరారు. చర్చలు సానుకూలంగా జరిగాయని, సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ ప్రక్రియకు త్వరిత పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గౌరవనీయమైన హోదా పొందడం వల్ల రథ యాత్రకు వారసత్వ గౌరవం పరిరక్షించడంతో భారత దేశపు గొప్ప సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకట్టుకోవచ్చని ఎస్‌జేటీఏ భావిస్తుంది.
పూరీ శ్రీ జగన్నాథ రథ యాత్ర (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment