ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు: ముఖేష్ మహాలింగ్
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పూర్తి వివరాలు సోమవారం జరిగిన సభలో ప్రవేశ పెట్టారు. విపక్ష ఉప నేత ప్రసన్న ఆచార్య అడిగిన ప్రశ్నకు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్ శాసన సభ బడ్జెటు సమావేశాల్లో ఈ వివరాలు ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం.. మాజీ, ప్రస్తుత ఎంపీలపై 22 సాధారణ కేసులు, 39 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 115 కేసులను ఎదుర్కొంటున్నారు. వారిపై 418 క్రిమినల్ కేసులు నమోదైనట్లు మంత్రి సభలో వివరాలు ప్రవేశ పెట్టారు. వీటిలో 384 కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. 14 కేసులలో విచారణ పూర్తయింది. మరో 43 కేసులకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుల్లో 198 కేసులు పూర్తిగా రాజకీయ స్వభావం కలిగినవిగా గుర్తించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
జయపురం: జయపురం రైల్వే స్టేషన్‌లో స్పృహలేకుండా పడి ఉన్న అపరిచిత వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధి గగణాపూర్ పోలీసు పంటి పరిధిలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక వ్యక్తి స్పృహలేకుండా పడి ఉన్నట్లు, కున నాయిక్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా తెలియజేశారన్నారు. పోలీసులు వెళ్లి అతన్ని జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చారని అయితే అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారని పోలీసు అధికారి జచీంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామన్నారు.
గుణుపూర్‌లో 40 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సద్భావన సమావేశం హాల్‌లో జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహోరో ఆధ్వర్యంలో సొమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. గుణుపూర్ పరిసర ప్రాంతాలకు చెందిన 40 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో 27 వ్యక్తిగతమైనవి కాగా 13 గ్రామ సమస్యలుగా గుర్తించారు. జిల్లా ఎస్పీ శ్వాతి ఎస్ కుమార్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
పర్లాకిమిడి: Ý린MýS Hyø ÐéÆý‡$z VýS…VýS$-Ë$ÐéÇ Ò«¨MìS ^ðl…¨¯]l Vøí³ »ñæàÆ> (40) EÇÐólçÜ$Mö° B™èlÃ-çßæ-™èlÅMýS$ ´ëÌSµ-yézyýl$. B¨-ÐéÆý‡… Æ>{† Hyýl$ VýS…rÌS çÜÐ]l$Ķæ$…ÌZ C…sìæ-ిMìS ™èlÍÏ-Æ>-V>.. MýS$Ð]l*Æý‡$yýl$ Vøí³ »ñæàÆ> EÇ-Ðól-çÜ$-Mö° ÐólÌê-yýl$™èl* E…yýl-sê°² VýSÐ]l$-°…-_…-¨. ©…™ø D ÑçÙ-Ķæ$OÐðl$ MýS$Ð]l*È »ñæàÆ> ÝùÐ]l$ÐéÆý‡… E§ýlĶæ$… ™èlÐ]l$MýS$ íœÆ>ŧýl$ ^ólíܯ]lr$t B§ýlÆý‡Ø ´ù΋Ü-õÜt-çÙ¯ŒS íܺ¾…¨ ™ðlÍ´ëÆý‡$. ´ùÎçÜ$ õÜtçÙ¯ŒS IIïÜ {ç³Ô>…™Œæ ¿¶æ*糆 B§ól-Ô>ÌS Ðól$Æý‡MýS$ GOòÜÞ Mú†M> Ôðæv MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$. Vøí³ »ñæàÆ> Ð]l$–™èl-§ólà°² ´ùçÜ$t-Ð]l*Æý‡t… °Ñ$™èl¢… Ý린MýS {糿¶æ$™èlÓ Bçܵ-{†MìS ™èlÆý‡-Í…-_¯]lr$t IIïÜ {ç³Ô>…™Œæ ¿¶æ*糆 ™ðlÍ-´ëÆý‡$.
ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు: ముఖేష్ మహాలింగ్
Comments
Please login to add a commentAdd a comment