మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి
జయపురం: మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని గగణాపూర్‌లోని సేవా పేపరుమిల్లు ప్రధాన గేటువద్ద విశ్రాంత కార్మికులు, మృత కార్మికుల కుటుంబ సభ్యులు సోమవారం ఆందోళన చేపట్టారు. సేవాపేపరుమిల్లు ప్రథమ యూనిన్ అధ్యక్షులు, ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ మహంతి నేతృత్వంలో నిర్వహించిన ఆందోళనలో మృత కార్మికుల వితంతు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిల్లు యూనిట్ హెడ్ ఎస్.ఎస్.పాల్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్మిక నేత మహంతి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో, ఉద్యోగ విమరణ తరువాత మరణించిన కార్మికుల కుటుంబాలకు చట్టపరంగా లభించాల్సిన బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. 2020 ఫిబ్రవరి 26వ తేదీన మిల్లును కొత్త కంపెనీకి అమ్మివేసిందని, మిల్లు నడిపేందుకు కార్మికులకు చెల్లించాల్సిన బకాయీలు చెల్లించేందుకు 2020 నుంచి 2023 మధ్యకాలంలో రూ. 200 కోట్లు అప్పుచేసిందన్నారు. అందులో పాత యజమాని రూ. 100 కోట్లు తీసుకున్నట్లు మహంతి వెల్లడించారు. బిజినెస్ ట్రాన్షపర్ అగ్రిమెంట్ ప్రకారం రూ. 15 కోట్లు చెల్లించేందుకు నిర్ణయించారని గుర్తు చేశారు. మరణించిన కార్మికులు మిల్లు కోసం శ్రమశక్తిని దారబోశారన్నారు. ఇప్పుడు యాజమాన్యం 75, 80 ఏళ్ల వయసు అధికారులకు లక్షలాది రూపాయలు ఇస్తుందని, వారికి గెస్ట్ హౌస్‌లు, ఉచిత భోజనం, వెహికల్ సమకూర్చుతోందన్నారు. అయితే మిల్లులో చెమటోడ్చి పనిచేసిన మృత కార్మిక కుంటుంబాలు దుర్భర జీతితం గడుపుతున్నా.. వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించటం లేదని దుయ్యబట్టారు. చివరకు పీఎఫ్ డబ్బులను కూడా తీసుకోలేని పరిస్థితి ఉందన్నారు. దాదాపు 39 మంది విశ్రాంత కార్మికులతోపాటు మరికొంత మంది కంట్రాక్ట్ కార్మికులు మరణించడంతో వారి కుటుంబాలు దర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయన్నారు. ఇప్పటికై నా వారికి చెల్లించాల్చిన బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు.
మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment