నేరాలపై మౌనమెందుకు..?: కాంగ్రెస్
భువనేశ్వర్: రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా మహిళల భద్రత పెద్ద సమస్యగా తాండవిస్తుంది. మరో వైపు ప్రభుత్వం చోద్యం చూస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, ప్రభుత్వ ఉదాసీనతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. శాసన సభ లోపల, బయట ఆందోళనలు నిర్వహించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యాలయాల ముట్టడి, గవర్నరుకు వినతి పత్రం సమర్పణ కార్యక్రమం విజయవంతంగా చేపట్టింది. రాష్ట్రంలో మహిళలతో పాటు బాలికలకు రక్షణ కొరవడింది. సోమవారం జరిగిన శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో 2020 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 72 మంది విద్యార్థుల ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రాష్ట్ర అసెంబ్లీకి ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. శాసన సభో సమర్పించిన వివరాల ప్రకారం జనవరి నెలలో 111 హత్య కేసులు, 20 దోపిడీ కేసులు, 1,509 దొంగతనం కేసులు నమోదయ్యాయి. అదనంగా, 194 సైబర్ క్రైమ్ కేసులు, 655 దుష్ప్రవర్తన కేసులు కూడా నమోదయ్యాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో భద్రతా పరిస్థితి పట్ల తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment