పర్లాకిమిడిలో డోలోత్సవాలు ప్రారంభం
పర్లాకిమిడి: స్థానిక డోలా ట్యాంకు రోడ్డులో డోలా ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీజగన్నాథ మందిర ప్రాంగణంలో ఉన్న రామస్వామి మందిరం నుంచి రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాలను పల్లకీపై మోసుకు వచ్చి గజపతి ప్యాలెస్‌లోకి తీసుకెళ్లారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కోటలో మహారాజా బ్రాహ్మణులు విచ్చేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం అనేక పురవీధులలో రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాల పల్లకిని మోసుకువెళుతూ పోగో (రంగులు) జల్లారు. పర్లాకిమిడి సముటియా వీధి సంకీర్తన మండళి, కె.సీతాపుచం, సుందరాడ, యువరాజపురం, జాజిపురం గ్రామాలనుండి ప్రభు శ్రీక్రిష్ణుని భక్తి భజనలు పాడుకుంటూ డోలా ట్యాంకు వద్దకు తీసుకువెళ్లారు. చివరికి డోలాట్యాంకు వద్ద ఉత్సవ మూర్తులను ఉంచి భక్తులు సమర్పించిన పువ్వులు, టెంకాయలు, ప్రసాదాలు స్వీకరించారు. డోలా ఉత్సవాలు ఈనెల 15 వరకూ డోలా ట్యాంకు వద్ద కోనసాగుతాయని డోలోచెరువు అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు.
పర్లాకిమిడిలో డోలోత్సవాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment