ముందుచూపు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ముందుచూపు తప్పనిసరి

Published Tue, Mar 11 2025 12:46 AM | Last Updated on Tue, Mar 11 2025 12:45 AM

ముందు

ముందుచూపు తప్పనిసరి

గ్లకోమా నివారణకు చర్యలు..

● గ్లకోమా వ్యాధి కుటుంబ చరిత్ర కలవారు ముప్‌పై సంవత్సరాల వయసు నుంచే సమగ్ర నేత్ర పరీక్షలు(దృష్టి పరీక్ష, కంటిలో ఒత్తిడి, ఫంగస్‌ ద్వారా రెటీనా పరీక్షలు, క్షేత్ర దృష్టి పరీక్షలు) చేయించుకోవాలి.

● 40 సంవత్సరాలు వయసు దాటిన తరువాత క్రమం తప్పకుండా రెండేళ్లకు ఒకసారి సమగ్రంగా నేత్ర పరీక్షలు చేయించుకోవాలి.

● వైద్యుల సలహా మేరకు మాత్రమే స్టెరాయిడ్‌ మందులు లేదా కంటి చుక్కల మందు వాడాలి.

● కంటి గాయాలను నిర్లక్ష్యం చేయకుండా నేత్ర నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందాలి.

● గ్లకోమా వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు నేత్ర నిపుణుల సలహా, సూచనల ప్రకారం నేత్ర పరీక్షలు చేసుకోవడం, మందులు వాడడం చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా శాశ్వత అంధత్వం వస్తుంది.

సాధారణంగా ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చాపకింద నీరులా ఈ వ్యాధి వ్యాప్తి చెంది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 9 నుంచి 15 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ‘గ్లకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యమవుదాం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తద్వారా ఈ వ్యాధి వల్ల సంక్రమించే అంధత్వాన్ని నివారించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
ముందుచూపు తప్పనిసరి1
1/1

ముందుచూపు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement