18న పీఎఫ్ కమిషనర్ కార్యాలయాల ఘెరావ్
జయపురం: పీఎఫ్ కమిషనర్ కార్యాలయాన్ని ఈ నెల 18 వ తేదీన ఘెరావ్ చేయాలని జాతీయ ఈపీఎప్ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్ణయించిందని కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి వెల్లడించారు. స్థానిక కార్మిక భవనంలో సోమవారం ఈపీఎఫ్ పెన్సనర్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నళినీకాంత రత్ అధ్యక్షతన జరిగిన పెన్షనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ కష్టార్జితాన్ని కట్టి తిరిగి పొందలేకపోతున్నారని ఆరోపించారు. ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు ఇప్పటికై నా నెలకు రూ.9వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఏతోపాటు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తున్నా పాలకులు స్పందించడం లేదన్నారు. ఆందోళనను ఉద్ధృతం చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్న లక్ష్యంతో ఈ నెల 18న దేశ వ్యాప్తంగా పీఎఫ్ కమిషనర్ల కార్యాలయాల ముందు ధర్నా చేయనున్నామన్నారు.
పోరాటాలతోనే హక్కుల సాధన
జయపురం: పోరాటం ద్వారానే హక్కులు సాధించలగమని నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమన్వయ సమితి కొరాపుట్ జిల్లా శాఖ అధ్యక్షుడు శశిభూషణ దాస్ అభిప్రాయపడ్డారు. స్థానిక యాదవ భవనంలో సోమవారం జరిగిన రాష్ట్ర నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సమన్వయ సమితి కొరాపుట్ జిల్లా శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందని విమర్శించారు. ఎప్పటి కప్పుడు నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల డిమాండ్లను విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. అందరూ ఒక్కటిగా నిలిచి ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రారంభ వేతనాలు సవరించాలని, కోవిడ్ సమయంలో తగ్గించిన డీఏ వెంటనే చెల్లింపు, ఇంటి అద్దెలు సమానంగా చెల్లించాలని, పూర్వ నియమం ప్రకారం సహాయం అందించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగాలను రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధర్నా
భువనేశ్వర్: రాష్ట్రంలో సగటు మహిళకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ పరిస్థితుల పట్ల ప్రభుత్వ చర్యలు శూన్యంగా పరిణమిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళల పట్ల నేరాలు నిత్యకృత్యాలుగా మారి నేర సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రభుత్వం వివరణ కోరుతూ శాసన సభ బడ్జెటు సమావేశాల్లో కాంగ్రెసు సభ్యులు రంకెలు వేశారు. వీరి గోడుని స్పీకరు పెడ చెవిన పెట్టడంతో పోడియం చుట్టు ముట్టేందుకు విఫలయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు స్పీకరు వరుసగా సభా కార్యక్రమాల్ని వాయిదా వేయడంతో సభ నుంచి బయటకు తరలి వచ్చి గాంధీ మహాత్ముని బొమ్మ దగ్గర బైఠాయించి నిరసన ప్రదర్శించారు.
60 యూనిట్ల రక్తం సేకరణ
రాయగడ: స్థానిక యూజీఎంఐటీలో సొమవారం సంబాద్, అమో ఒడిశా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 60 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఆయా సంస్థలకు చెందిన అరవింద్ ప్రధాన్, డాక్టర్ ప్రదీప్ కుమార్ త్రిపాఠి, మానస్ రంజన్ ప్రధాన్ ఈ కార్యక్రమంలొ పాల్గొని పర్యవేక్షించారు.
18న పీఎఫ్ కమిషనర్ కార్యాలయాల ఘెరావ్
18న పీఎఫ్ కమిషనర్ కార్యాలయాల ఘెరావ్
18న పీఎఫ్ కమిషనర్ కార్యాలయాల ఘెరావ్
Comments
Please login to add a commentAdd a comment