బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
● కొరాపుట్ జిల్లాలో
తెలుగు
సినిమాల షూటింగ్స్
● సందడి చేస్తున్న అగ్ర హీరోలు
● పెరిగిన
పర్యాటకుల తాకిడి
భారీ భద్రత
రోజురోజుకీ సందర్శకుల తాకిడి పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇక్కడ ప్లాటూన్ పోలీసులను మోహరించింది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు సుమారు 80 మంది భద్రతా ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. ఇప్పటికే మహేష్‌బాబు, మళయాల విలన్ పృథ్వీరాజ్ కరుణాకరణ్‌లు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇంకా హిందీ నటులు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాంలు రావాల్సి ఉంది. ఒడిశా ప్రభుత్వం కూడా సినిమా నిర్మాణానికి పూర్తి సహకారం అందజేస్తోంది. తద్వారా ఈ ప్రాంతం పర్యటక రంగంలో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తోంది.
ప్రముఖుల హర్షం
ప్రస్తుతం రాజమౌళి సినిమా బృందం సందడి చేస్తుండడంపై రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నాయకుడు రాం చంద్ర ఖడం మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ ప్రాంతంలో షూటింగ్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అవసరమైతే తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. మరిన్ని తెలుగు సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయాలని కోరారు. బీజేడీకి చెందిన కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక మాట్లాడుతూ.. రాజమౌళి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి సినిమాలు ఈ ప్రాంతంలో తీయడం వలన స్థానికులకు ఉపాధితో పాటు ఆదాయం వనరులు పెరుగుతాయన్నారు.
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment