పాముకాటుకు గురై ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
రామభద్రపురం: మండలంలోని నాయుడువలసకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్నిపల్లి సత్యనారాయణ(36) గ్రామంలోని మామిడితోటలో ఉపాధి కూలీలు వారం రోజులుగా చేసిన ఉపాధి పనుల కొలతలు వేసేందుకు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్తుండగా తోటలో ఆకులు ఎక్కువగా ఉండడంతో ఆకుల కింద పాము ఉందన్న విషయం తెలుసుకోలేక కాలితో మట్టేశాడు. దీంతో ఆకుల కింద ఉన్న పాము కాటు వేయడంతో స్థానికులు మెరుగైన చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. మృతుని భార్య గత రెండేళ్ల క్రితం మృతి చెందింది. పెద్ద పాప జ్యోతి ఇంటర్‌మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు రాస్తోంది. రెండవ పాన నిఖిత 7 వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలిద్దరూ దిక్కులేని వారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment