వన్‌ధన్‌ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలి | - | Sakshi
Sakshi News home page

వన్‌ధన్‌ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలి

Published Wed, Mar 12 2025 7:30 AM | Last Updated on Wed, Mar 12 2025 7:26 AM

వన్‌ధన్‌ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలి

వన్‌ధన్‌ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలి

పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని వన్‌ధన్‌ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలని ఐటీడీఏ పీఓ అశుతోష్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో వీడీవీకేల నిర్వహణ, యంత్రాల కొనుగోలుపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీడీవీకేల ఉత్పత్తులు పెంచేందుకు అవసరమైన యంత్ర సామగ్రిని వారికి సమకూర్చి, వాటిపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ ఏర్పాటు చేసి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వెలుగు ఏపీడీ, వెలుగు 8మండలాల ఏపీఎంలు, హెడ్‌క్వార్టర్‌ ఏపీఎంలు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ అశుతోష్‌ శ్రీవాత్సవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement