హాస్టల్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
రాజమౌళి షూటింగ్ షురూ
పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కొద్దిరోజుల క్రితం సామాన్య వ్యక్తి మాదిరిగా విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో వస్తూ ఈ ప్రాంత అందాలను తిలకించారు. దీనిలో భాగంగా కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో స్టే చేశారు. ఇక్కడి అందాలను గమనించి తాను ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో చేస్తున్న సినిమా షూటింగ్ షురూ చేశారు. దీంతో ఈ ప్రాంతం సందడిగా మారింది. ప్రస్తుతం సిమిలిగుడ ప్రాంతంలోని హోటళ్లలో గదులు దొరకడం లేదు. ఆంధ్ర సరిహద్దు సాలూరుకి కూతవేటు దూరంలో దేవమాలి పర్వతంపై ఈ సినిమా తీస్తున్నారు. అందువలన ప్రతిరోజూ ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి వందలాది మంది అభిమానులు తారలను చూసేందుకు తరలి వస్తున్నారు.
పెళ్లి పీటలెక్కనున్న మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి
కొరాపుట్: నబరంగ్‌పూర్ మాజీ ఎంపీ, బీజేడీ నాయకుడు ప్రదీప్ మజ్జి వివాహం బుధవారం జరగనుంది. గోవాలోని పనాజీలో తన వివాహం జరుగుతుందని ఆయన స్వయంగా ప్రకటించారు. జర్నలిస్ట్ సుశ్రీ సంగీతా సాహుని ప్రేమ వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరికీ భువనేశ్వర్‌లోని జిమ్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్వేష హాస్టల్‌లో విద్యార్థిపై తోటి విద్యార్థుల మూకుమ్మడి దాడిపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు హాస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రస్మిత సాహుపై సస్పెన్షన్ వేటువేసింది. అదేవిధంగా హాస్టల్‌లో వంటలు చేసే మరో ముగ్గురిని విధుల నుంచి తొలగించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమారావ్ ఆదివారం హాస్టల్‌కు వెళ్లి దర్యాప్తు చేపట్టి జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించింది. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో మరోసారి సోమవారం హాస్టల్‌కు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. అలాగే హాస్టల్ నుంచి తొమ్మిది మంది విద్యార్థులను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. వీరిలో 8 మంది విద్యార్థుల అనుచిత ప్రవర్తనపై జిల్లా అదనపు సంక్షేమ శాఖ అధికారి గంగాధర్ బెహర గుణుపూర్ ఆదర్శ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హాస్టల్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
హాస్టల్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
హాస్టల్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
హాస్టల్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
హాస్టల్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment