యాక్షన్..!
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి కొరాపుట్ జిల్లా నేడు సినిమా షూటింగ్స్‌తో సందడిగా మారింది. 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేవి. అయితే ప్రస్తుతం అంతా మారిపోయింది. ప్రకృతి అందాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం సినీ తారల ఆటపాటలతో కళకళలాడుతోంది. దీంతో ఒకప్పుడు ఈ ప్రాంతానికి బదిలీపై రావాలంటే భయపడిన అధికారులే నేడు బదిలీకి ముచ్చటపడుతున్నారు. లక్షలాది మంది దేశ, విదేశీయులు విహార యాత్రలకు కోసం తరలివస్తున్నారు. – కొరాపుట్
స్టార్ట్.. కెమెరా..
ఇప్పటివరకు చిత్రీకరణలు
ఈ ప్రాంతంలో ఇదివరకే ప్రముఖ చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. పుష్ప–2 సినిమాను పక్కనే ఉన్న మల్కన్‌గిరి జిల్లాలో అత్యధిక భాగం షూటింగ్ చేవారు. ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కొరాపుట్ జిల్లాలోనే చిత్రీకరణ చేశారు. అప్పట్లో వేంకటేష్ తదితర నటులు ఈ ప్రాంతంలో పర్యటించారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ సినిమా కొరాపుట్ జిల్లాలోనే అత్యధిక భాగం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రజల ముందుకు రానుంది. ఈ సినిమా జయపూర్ మెయిన్ రోడ్డు మీద షూటింగ్ చేయడం గమనార్హం.
తప్పని లీకుల గోల
రాజమౌళి బృందం పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ లీకుల బెడద తప్పడం లేదు. మహేష్‌బాబుని విలన్ అనుచరులు నెట్టుకుంటూ వస్తుండగా, విలన్ వీల్ చైర్ మీద ఉండడం, మహేష్ బాబు అక్కడకి చేరడం వంటి వీడియోలు లీకయ్యాయి. ఇవి కొరాపుట్ జిల్లాలో, సోషల్ మీడియాలో ఆదివారం వైరల్ అయ్యాయి. ఒక వ్యక్తి సందర్శకుడి మాదిరిగా వచ్చి కారులో కూర్చుని ఈ వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment