కలెక్టరేట్ ముట్టడి
పర్లాకిమిడి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశావర్కర్లు కలెక్టరేట్‌ను మంగళవారం ముట్టడించారు. ముందుగా ఒడిశా రాష్ట్ర ఆశా కార్మిక సంఘం, సంయుక్త భారతీయ మజ్దూర్ సంఘ్‌తో కలిసి రాజవీధి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద భారతీయ మజ్దూర్ సంఘ అధ్యక్షుడు సుజిత్ ప్రధాన్ మాట్లాడుతూ.. ఆశవర్కర్ల వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా ఫెసిలేటర్లు, బీటీటీ కో–ఆర్డినేటర్లకు ఈపీఎఫ్, రిటైర్‌మెంట్ తర్వాత గ్రాట్యూటీ, మరణిస్తే కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతామని ఆశావర్కర్ల సంఘం అధ్యక్షురాలు కమలా బెహరా హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మమతా మహంతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment