ముగిసిన జాతీయ విజ్ఞాన దినోత్సవ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో శ్రీకాకుళం, టెక్కలి, పలాస మూడు డివిజన్ల పరిధిలో విజేతలగా నిలిచిన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాథమిక, సెకండరీ విభాగాల్లో క్విజ్, ఎక్‌పైర్‌మెంట్, సింపోసియం (విశ్లేషనాత్మక చర్చ) అంశాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు కాంతారావు, డీఈఓ తిరుమల చైతన్య బహుమతులు అందజేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు శాసీ్త్రయమైన దృక్పథాలను అలవర్చుకోవాలని, పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అంతకుముందు కార్యక్రమ కో–ఆర్డినేటర్, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి పోటీలను పర్యవేక్షించారు. వీటి కొనసాగింపుగా జరిగే రాష్ట్రస్థాయి విజ్ఞానశాస్త్ర దినోత్సవ పోటీలు (తేదీలు ఖరారుకాలేదు) శ్రీకాకుళంలోనే జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి(టెక్కలి)పి.విలియమ్స్, జిల్లా సైన్స్ అధికారి ఎన్.కుమారస్వామి, సైన్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజేతలు వీరే..
క్విజ్: ప్రాథమిక స్థాయిలో ఎంపీపీ స్కూల్ గంగువాడ, ఎంపీపీ స్కూల్ నందిగాం మెయిన్, ఎంపీపీ స్కూల్ పెద్దలంకాం మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. సెకండరీ స్థాయిలో జెడ్పీహెచ్ స్కూల్ కొయ్యాం, జెడ్పీహెచ్‌స్కూల్ ప్లస్ హరిపురం, జెడ్పీహెచ్ స్కూల్ బోరివంగ తొలి మూడుస్థానాలు సాధించాయి.
ఎక్‌పైర్‌మెంట్: ప్రాథమిక స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జెడ్పీహెచ్ స్కూల్ కోటబొమ్మాళి, ఎంజేపీడబ్ల్యూఆర్‌జీ స్కూల్ హయాతీనగరం, జెడ్పీహెచ్ స్కూల్(బోర్డు) నరసన్నపేట మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
సింపోసియం: సెకండరీ స్థాయిలోనే జరిగిన ఈ పోటీల్లో జెడ్పీహెచ్ స్కూల్ రొంపివలస, జెడ్పీహెచ్ స్కూల్ కొసమాల, జీహెచ్ స్కూల్ కవిటి పాఠశాలలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment