మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
పర్లాకిమిడి: మహిళల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. స్థానిక గజపతి స్టేడియంలో జిల్లాస్థాయి లక్షాధిపతి దిద్దీల వర్క్‌షాపును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తే కుటుంబాలు బాగుంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒడిశా జీవికా మిషన్ అధికారి టిమోన్ బోరా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సీడీఎం శంకర్ కెరకెటా, అదనపు ఈవో పృథ్వీరాజ్ మండల్, పురపాలక శాఖ కార్యనిర్వహణ అధికారి లక్ష్మణ ముర్ము, జిల్లా సంక్షేమశాఖ అధికారి మనోరమా దేవి తదితరులు పాల్గొన్నారు.
మల్కన్‌గిరి: స్థానిక మాల్యవంత్ హాస్టల్ ప్రాంగణంలో లక్షపతి దిదీ కార్యశాల కార్యక్రమం కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, మల్కన్‌గిరి సమితి అధికారి తపన్ కుమార్ సేవపతి తదితరులు పాల్గొన్నారు.
మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
Comments
Please login to add a commentAdd a comment