ఉత్తర ద్వార దర్శనంలో శ్రీదేవి భూదేవి సమేత నారసింహుడిని దర్శించుకుంటున్న భక్తులు
తాడేపల్లిరూరల్: నగరంలో వేంచేసియున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన శ్రీదేవి భూదేవి సమేత నారసింహుని ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్వంలో మునిగి తేలారు. శుక్రవారం రాత్రి బంగారు గరుడ వాహనంపై జగన్మోహిని అలంకారంలో గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామివారి ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణతో తిరువంజనోత్సవం నిర్వహించుకుని శ్రీదేవి భూదేవి సమేతుడై బంగారు గరుడ వాహనంపై శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వార దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న భక్తులు బంగారు శంఖుతో తీర్థం స్వీకరించారు. ముక్కోటి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో పలువురు న్యాయమూర్తులు, రాష్ట్ర సమాచార ప్రసార సినిమాటోగ్రఫీ శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి, వైస్సార్‌సీపీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, పలువురు న్యాయవాదులు, అధికారులు దర్శించుకున్నారు.
ముక్కోటికి కిటకిటలాడిన మంగళాద్రి
ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన స్వామి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల
నుంచి రాక
Comments
Please login to add a commentAdd a comment