ఎమ్మెల్సీ ఓటర్లకు 90 పోలింగ్ స్టేషన్లు
నరసరావుపేట: ఈనెల 27న జరగనున్న కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పల్నాడు జిల్లాలో 38 ప్రాంతాలలో మొత్తం 90 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో మండల అభివృద్ధి అధికారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై నిర్వహించిన శిక్షణ తరగతులలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
● జిల్లాలో మొత్తం 56,964 మంది పట్టభద్రులు ఓటుహక్కు కలిగి ఉన్నారు. వారిలో 37,832 మంది పురుషులు, 19,129 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారని తెలిపారు.
● అంతా ఓటుహక్కు సజావుగా వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
● ప్రిసైడింగ్ అధికారులు 108 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 108 మంది, ఓ.పి.ఓ.లు 216 మంది, సూక్ష్మ పరిశీలకులుగా 46 మందిని నియమించినట్లు తెలిపారు.
● పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఐదు రకాల టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
● ఎం.సి.సి., ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు 36 చొప్పున, ఏడు వీడియో సర్వైలెన్స్ టీంలు, 17 మందిని సెక్టార్ ఆఫీసర్స్ రూట్ అధికారులుగా నియమించడం జరిగిందని పేర్కొన్నారు.
● ముగ్గురు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై శిక్షణ ఇస్తున్నారని, మండల అధికారులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, రెవెన్యూ డివిజినల్ అధికారులు మధులత, రమాకాంత్‌రెడ్డి, మురళీకృష్ణ పాల్గొన్నారు.
మొత్తం ఓటర్లు 56,964 మంది ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.అరుణ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment