ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
నరసరావుపేట: ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శివనాగేశ్వరరావు పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆర్టీసీ జిల్లా రవాణా అధికారి ఎన్‌వీ శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం గ్యారేజ్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో శివనాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్లకు పలు విషయాలపై అవగాహ కల్పించారు. మరో అతిథి సింధూ స్కూలు అధినేత రామకృష్ణ మాట్లాడుతూ డ్రైవర్ల వల్లే ఆర్టీసీకి మంచి పేరు వచ్చిందని వివరించారు. విధి నిర్వహణలో గుండెపోటు వస్తే వేసుకోవాల్సిన మందులను సింధు విద్యా సంస్థ ద్వారా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ సీపీఆర్ చేసే విధానాన్ని డ్రైవర్లకు వివరించారు. ట్రాఫిక్ సీఐ లోకనాథం మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. అనంతరం 36 ఏళ్లపాటు పనిచేసిన చిలకలూరిపేట డిపో డ్రైవర్ రాఘవరావుతోపాటు మరో 19 మంది ఉత్తమ డ్రైవర్లను సన్మానించారు. సర్టిఫికెట్లు, పారితోషికాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ ప్రసాదు, డ్రైవర్లు, గ్యారేజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
రోడ్డుభద్రతా మాసోత్సవాల ముగింపు 20 మంది ఉత్తమ డ్రైవర్లకు సన్మానం
Comments
Please login to add a commentAdd a comment