మాచవరం: మండల కేంద్రమైన మాచవరంలో శ్రీలక్ష్మితిరుపతమ్మగోపయ్య స్వామి వార్ల కల్యా ణోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన పోటీల్లో భాగంగా ఆరుపళ్ల విభాగంలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 4000 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఏటుకూరి శ్రీనివాసరావు (పెదకూరపాడు), రామినేని రత్తయ్య (తోటపాలెం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా) కంబైన్డ్ జత 3773.7 అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో, నలమాద ఉత్తమ్‌పద్మావతి (ఎమ్మెల్యే, కోదాడ, తెలంగాణ) ఎడ్లు 3420.1 అడుగులు దూరాన్ని లాగి మూడవ స్థానంలో, అనంతనేని శ్రీకావ్య, శ్రీమధు ( యనమలకుదురు, పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా ఎడ్లు 3396.1 అడుగులు దూరాన్ని లాగి నాల్గవ స్థానంలో, మేకా అంజిరెడ్డి ( చల్లగుండ్ల, నెకరికల్లు మండలం, పల్నాడు జిల్లా, ఎడ్లు 3023.5 అడుగులు దూరాన్ని లాగి ఐదో స్థానంలో, మన్నెంపల్లి యశస్వణి (మాచవరం, పల్నాడు జిల్లా), వసంతతవరపు శ్రీలాస్య, శ్రీమనోజ్ (పిన్నెల్లి, మాచవరం మండలం, పల్నాడు జిల్లా) కంబైన్డ్ జత 2339.5 అడుగులు లాగి ఆరో స్థానంలో, యామని రామారావు ( కొత్తపాలెం, మాచవరం మండలం, పల్నాడు జిల్లా) ఎడ్లు 2000 అడుగులు, ముత్న వెంకటరెడ్డి (గోగులపాడు, గురజాల మండలం, పల్నాడు జిల్లా) ఎడ్లు 528 అడుగులు లాగి ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచి వరుస బహుమతులు అందుకున్నాయి. శుక్రవారం న్యూ కేటగిరి (సేద్యం విభాగం) లో పోటీలు కొనసాగుతున్నాయి.
ఆరుపళ్ల విభాగంలో ప్రథమస్థానం కై వసం
Comments
Please login to add a commentAdd a comment