కూటమి కుట్ర
అనర్హుల పేరుతో ఇళ్లు రద్దు చేసే యోచన
నరసరావుపేట: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లోని (నూతన పీఎంఏవై, ఎన్‌టీఆర్ నగర్ స్కీము) లబ్ధిదారుల మెడలపై కూటమి ప్రభుత్వం కత్తి వేలాడతీసింది. ఈ మార్చి 31వ తేదీలోగా ఇళ్లు నిర్మించుకోని వారి స్థలాలు స్వాధీనం చేసుకుంటామని కూటమి నాయకులు చేస్తున్న ప్రకటనలతో బెంబేలెత్తిపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇల్లుకూడా మంజూరుచేయని ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పొందిన వారికి పార్టీలు అంటగట్టి ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
పేదల కోసం కాలనీలు ఇలా..
పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలనే దృక్పధంతో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జగనన్న కాలనీలకు రూపకల్పన చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 16 ప్రదేశాల్లో 39,625మందికి వేల ఎకరాల ప్రైవేటు భూమి కొనుగోలు చేసి ఒక్కొక్కరికి సెంటు చొప్పున ఇళ్ల పట్టాలతో పాటు గృహాలు కేటాయించింది. ప్రతి పట్టాను మహిళ పేరుతో ఇవ్వటమే గాకుండా ఐదేళ్ల అనంతరం వాటిని విక్రయించుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించింది. వారిపేరుపై ఒక్క రూపాయి ఖర్చుతో రిజిస్ట్రేషన్ చేసింది. దీనిలో ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద ఇచ్చే రూ.1.50లక్షలకు తోడుగా తాను రూ.30వేలు అదనంగా ఇవ్వటంతో పాటు ఇసుక, సిమెంట్, స్టీలు ఉచితంగా అందజేశారు.
లబ్ధిదారుల మెడలపై కూటమి కత్తి మార్చి 31లోగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోతే స్థలాలు స్వాధీనం ప్రచారం చేస్తున్న కూటమి నాయకులు బెంబేలెత్తుతున్న లబ్ధిదారులు
అది మా పనికాదు
ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకునే హక్కు మాకు లేదు. అది మా గృహనిర్మాణశాఖ పని కాదు. మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. లబ్ధిదారులను మార్చి 31లోగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని కోరుతున్నాం.
– ఎస్. వేణుగోపాలరావు,
పీడీ, గృహనిర్మాణశాఖ
పోరాటం చేస్తాం..
పేదలు తమకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చీరాగానే ఇళ్ల నిర్మాణం చేసుకోని వారి స్థలాలు స్వాధీనం చేసుకుంటామంటూ ప్రకటనలు ఇవ్వటం ఏమాత్రం సముచితం కాదు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.50లక్షలు బేస్‌మెంట్ స్థాయికే సరిపోతుంది. కనీసం రూ.5లక్షలు సాయం చేస్తేనే నేటి ధరలు, కూలీకి ఇల్లు ఏర్పడుతుంది. ఈవిధంగా సహాయం చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందిపెడతామంటే వారిని కూడగట్టుకొని పోరాటం చేస్తాం.
– షేక్ శిలార్ అహ్మద్,
సీఐటీయూ జిల్లా కార్యదర్శి
కూటమి కుట్ర
కూటమి కుట్ర
కూటమి కుట్ర
Comments
Please login to add a commentAdd a comment