ఇసుక లభ్యత గగనం.. ఇంటి నిర్మాణం కష్టం
అందజేసిన స్థలాల్లో 14,042 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. అసలు 8455 స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలే మొదలు కాకపోగా, మిగతా వాటిలో బేస్‌మట్టం స్థాయి నుంచి రూఫ్ లెవల్ వరకు వివిధ దశల్లో గృహాలు ఉన్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎటువంటి చేయూత అందించకపోవటంతో వారిలో నిస్తేజం ఏర్పడింది. ప్రభుత్వ అస్తవ్యస్త విధానంతో లబ్ధిదారులకు ఇసుక దొరకటమే కష్టంగా మారింది. దీంతో పాటు గత ప్రభుత్వం పేదలకు అందజేసిన ఏ ఒక్క పథకం అమలుచేయకపోవటంతో చేతిలో చిల్లిగవ్వ కన్పించటం కష్టంగా మారింది. దీంతో ఇంటి నిర్మాణం తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ నేపధ్యంలో వచ్చే మార్చిలోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించని 8455 మంది లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా, ఇటీవల కాలనీని సందర్శించిన రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ లబ్ధిదారులు వచ్చే 2026 డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.1.50లక్షలు రావని చెప్పటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment