నరసరావుపేటటౌన్ : రాజీ మార్గం ద్వారా సమస్య పరిష్కరించుకుందామని పుల్లారావు బాధిత సంఘ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం కమ్మ హాస్టల్లో సాయిసాధన చిట్‌ఫండ్ బాధితులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పుల్లారావుపై నమోదైన చిట్‌ఫండ్ క్యాంపు కేసు సీఐడీకి బదిలీ చేస్తే న్యాయం జరగటంలో ఆలస్యం జరుగుతుందన్నారు. పుల్లారావు తరఫున మధ్యవర్తిత్వం వహించేందుకు కొందరు ముందుకు వస్తున్నారు కాబట్టి బాధితుల తరఫున కమిటీగా ఏర్పడ్డ సభ్యులు వారితో చర్చించి సమస్య పరిష్కారానికి దారి చూపాలన్నారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో ఐక్యంగా కలిసి పోరాడుదాం అన్నారు. జరిగిన మోసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేవరకు ఆందోళనలు చేద్దామని తీర్మానించారు. కార్యక్రమంలో నాగోతు శౌరయ్య, కడియాల రమేష్, ఇ.ఎం.స్వామి, వి.మధుసూధనరావు పాల్గొన్నారు.
న్యాయం జరగని పక్షంలో
ఉద్యమం ఉధృతం చేద్దాం
సమావేశంలో తీర్మానించుకున్న
పుల్లారావు బాధితులు
Comments
Please login to add a commentAdd a comment