ముగిసిన నాటిక పోటీలు
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేట రంగస్థలి, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలు ముగిశాయి. చివరి రోజైన ఆదివారం నాటిక పోటీలను మద్ది లక్ష్మీశ్వేతా కిషోర్ జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ప్రారంభించారు. కాకినాడ జి.వి.కె.క్రియేషన్స్ వారి తితిక్ష, గుంటూరు అమరావతి ఆర్ట్స్ వారి చిగురు మేఘం నాటికలు ప్రదర్శించారు. మాదక ద్రవ్యాలు సమాజాన్ని నాశనం చేస్తుంటే గంజాయి సరఫరా చేసే కన్న కొడుకునే కడతేర్చి గంజాయి భూతాన్ని తరిమి కొట్టాలనే కన్నతల్లి ప్రయత్నమే కథాంశంగా తితిక్ష నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. డబ్బు సంపాదనే లక్ష్యంగా మారి వైద్యాన్ని అమ్ముకుంటున్న డాక్టర్ తన తప్పు తెలుసుకొని పేదలకు వైద్యం అందించేందుకు గ్రామ బాట పట్టడం ఇతివృత్తంగా చిగురు మేఘం ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాగా, శనివారం రాత్రి నాటిక పోటీలకు హాజరైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నాటక రంగాన్ని భావి తరాలకు అందించాలని కళాకారులను కోరారు.
సత్తా చాటిన
నరసరావుపేట
కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండో
చాంపియన్ షిప్ పోటీల్లో విజేత
అద్దంకి రూరల్: స్థానిక గీతామందిరంలో ఆదివారం జాతీయ స్థాయి ఓపెన్ కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. 6 రాష్ట్రాల నుంచి 650 మంది పాల్గొనగా.. నరసరావుపేట టీం విజయం సా ధించింది. పోటీల చీఫ్ ఆర్గనైజర్ పి.రాంబాబు మాట్లాడుతూ సొంత ఊరికి పేరు తేవాలని కోరికతోనే అద్దంకిలో నిర్వహించినట్లు తెలిపారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సాయిరాం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చిన్ని మురళీ కృష్ణ, చిన్ని శ్రీనివాసరావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, మలాది శ్రీనివాసరావు, కరాటే మాస్టర్ వెంకట రత్నం పాల్గొన్నారు.
ముగిసిన నాటిక పోటీలు
Comments
Please login to add a commentAdd a comment