గొప్ప పాలకుడు అన వేమారెడ్డి
మేడికొండూరు: మండల పరిధిలోని జంగుగుంట్ల పాలెం గ్రామంలో కొండవీటి రెడ్డి రాజు (అన వేమారెడ్డి) విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం గ్రా మస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి మాట్లాడుతూ కొండవీటి సామ్రాజ్యాన్ని పాలించిన పాలకుల్లో అన వేమారెడ్డి సుప్రసిద్ధుడన్నారు. అతని పరిపాలన క్రీ.శ.1364 – 1386 వరకు సాగిందని తెలిపారు. ఈయన పాలనలో కవులు, గాయకులకు ఎంతో ఆదరణ లభించిందని, వారికి అనేక విధాలుగా దానధర్మాలు చేసి కళలను పోషించినట్లు చరిత్ర చెబుతుందన్నారు. అనవేమారెడ్డి కొండవీటి పాలకుల్లోనే కాక ఆంధ్ర దేశాన్ని పాలించిన గొప్ప రాజులలో ఒకడని శివారెడ్డి తెలిపారు. ఈయన కాలంలో దశ దిశలా తన దండయాత్ర ద్వారా రాజ్యాన్ని విస్తరింప చేశాడన్నారు. విగ్రహావిష్కరణలో సర్పంచ్ శ్రీదేవి సాంబిరెడ్డి, మెంబర్ సాంబి రెడ్డి, తాళ్లకోటిరెడ్డి, నారసాని జయసూర్య, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ల బాపిరెడ్డి, చిర్రా శ్రీనివాసరెడ్డి, చిర్రా శేషిరెడ్డి పాల్గొన్నారు.
కొండవీడు కోట అభివృద్ధి కమిటీ
కన్వీనర్ కల్లి శివారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment