మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మహిళల ఆర్థిక సాధికారత కోసం ఉద్దేశించిన వెలుగు పథకం అవినీతితో అంధకార మయంగా మారుతోంది. మూడు మండలాల్లో రూ.కోట్లు పక్కదారి పట్టడం అధికారుల అవినీతిని తేటతెల్లం చేస్తోంది. బినామీ పేర్లతో రుణాలు.. సరిగా చెల్లింపులు చేయకపోయినా రుణ మంజూరు.. రికవరీని పట్టించుకోకపోవడం.. బదిలీ అయిన సీసీలు రికార్డులు అప్పగించ కుండానే వేరే విధుల్లోకి చేరిపోవడం, వారిపై చర్యలకు తాత్సారం చేయడం తదితర కారణాలతో వెలుగు పథకం లక్ష్యం నీరుగారుతోంది.
అమరావతి: మహిళల ఆర్థిక సాధికారత కోసం సుమారు 25 ఏళ్ల క్రితం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రారంభించిన వెలుగు పథకం నేడు కొంతమంది ఉద్యోగుల నిర్వాకం, అవినీతి వల్ల మహిళల జీవితాల్లో వెలుగులు నింపకపోగా చీకటిని మిగిల్చుతోంది. పల్నాడు జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న వెలుగు సంస్థలో 36,500 మహిళా గ్రూపులు ఉన్నాయి. వీటిలో సుమారుగా 3,65,500 మంది ఆర్థిక లావాదేవీలు చేస్తుంటారు.
వీఓలు, సీసీలే కీలకం..
వెలుగు సంస్థలో మహిళా గ్రూపుల నిర్వహణలో గ్రామౖ సమైక్య సంఘాలు, వాటిని అన్ని విధాలుగా నడిపించే సీసీలు కీలక పాత్ర పోషిస్తారు. కొందరు సీసీలు, గ్రామ సమైక్య సంఘాల లీడర్లు (వీఓ) ఇష్టారాజ్యంగా విధివిధానాలు అతిక్రమించి చెల్లింపులు సక్రమంగా లేకపోయినా మళ్లీ రుణాలు మంజూరు చేయడం, అలాగే సీ్త్రనిధి, ఇతర పథకాల వాయిదాల చెల్లింపులలో అవకతవకలు పాల్పడ్డారనే విమర్శలు వినవస్తున్నాయి. దీంతో వెలుగు పథకంలో గత రెండేళ్లుగా బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలు తప్ప మదే ఇతర పథకాల నుంచి వచ్చే రుణాలను దాదాపుగా నిలిపివేశారు. వెలుగు పథకంలో బదిలీ అయిన సీసీలు రికార్డులు అప్పగించకుండానే మరొక విధుల్లో చేరిపోవటంతో సమస్య జఠిలమవుతోంది. అసలు ఎటువంటి వేతనాలు, గౌరవ వేతనాలు లేని వీఓ అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు డిమాండ్ ఏర్పడిన పరిస్థితి. కొంతమంది యానిమేటర్‌లు, సీసీలు కొన్ని గ్రామ సమైఖ్య సంఘాలకు నామమాత్రంగా అధ్యక్ష, కార్యదర్శులను నియమించి చక్రం తిప్పి అనినీతి పాల్పడున్నారన్నానే ఆరోపణలు మెండుగా ఉన్నాయి.
న్యూస్‌రీల్
సీ్త్ర నిధి రికవరీ బకాయిలు సుమారు రూ.13.50 కోట్లు అమరావతి, అచ్చంపేట, ఈపూరు మండలాల్లో రూ.3కోట్లు పక్కదారి అవినీతికి పాల్పడిన ఉద్యోగులకే ఉన్నతాధికారుల ప్రోత్సాహం! జీతం లేని వీఓ పోస్ట్‌కీ డిమాండ్ పూర్తిస్థాయి విచారణ జరపాలని మహిళల డిమాండ్
సమగ్ర విచారణ జరపాలి
రూపాయి, రూపాయి కూడబెట్టుకుని ఆర్థికంగా ఎదుగుదామని డ్వాక్రా గ్రూపుల్లో చేరితే ఇక్కడా మహిళలకు అన్యాయమే జరుగుతుంది. జిల్లాలో గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా నిర్వహించే వెలుగు సంస్థలో కొన్ని మండలాల్లో అవినీతి జరిగింది. మిగిలిన మండలాల్లో కూడా లావాదేవీలు ఎలా ఉన్నాయో తెలియని పరిస్థితి. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్నతాధికారుల బృందంతో సమగ్ర విచారణ జరిపాలి. అలాగే వీలైనంత వరకు వెలుగు సంస్థలో మహిళా ఉద్యోగులను నియమించాలి
– కె.హనుమంతరెడ్డి,
సీఐటీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment