దూసుకొచ్చిన మృత్యువు
చేబ్రోలు: మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు సోమవారం వేకువజామునే నీరుకొండ ప్రాంతానికి మినుము కోత పనులకు ఆటోలో పయనమయ్యారు. దారంతా దట్టమైన పొగ మంచు కమ్మింది. నారాకోడూరు – బుడంపాడు గ్రామాల మధ్యకు వచ్చేసరికి గుంటూరు– 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూలీల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అల్లంశెట్టి అరుణకుమారి (39), కుర్రా నాంచారమ్మ (40), తోట సీతారావమ్మ (41) అక్కడికక్కడే మరణించారు. వీరితోపాటు ఎం. శివమ్మ, ఎం. శివపార్వతి, జి. మల్లేశ్వరి, ఏ. వెంకట ప్రవీణ, ఆర్. రత్నకుమారిలతో పాటు ఆటో డ్రైవర్ ఇబ్రహీంతో పాటు మరో ముగ్గురుకు గాయాలయ్యాయి. వీరంతా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన ముగ్గురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు.
రెక్కాడితే గాని
డొక్కాడని కుటుంబాలు
ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబాలది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. సుద్దపల్లి గ్రామంలోని యూపీ స్కూల్ సమీపంలో నివసిస్తున్న వీరంతా ఊరిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీరుకొండ పరిసర ప్రాంతాలకు కొద్ది రోజులుగా వెళుతున్నారు. రోజు మాదిరిగానే సోమవారం తెల్లవారుజామున ఆటోలో 12 మంది మహిళలు పనులకు బయలుదేరారు. పనులకు వెళ్లొస్తామంటూ చిరునవ్వుతో ఇంట్లోంచి బయలుదేరి వెళ్లిన వీరంతా కొద్దిసేపటికి ప్రమాద ఘటనా స్థలంలో మిగతా జీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
భయానక వాతావరణం
ప్రమాద సంఘటనలో ఆటో నుజ్జునుజ్జుగా మారి బోల్తా పడింది. ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రమాదంతో పొన్నూరు, గుంటూరు రోడ్డుకు ఇరువైపులా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. చేబ్రోలు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని క్రమబద్ధీకరించారు. పొన్నూరు రూరల్ సీఐ వై. కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్‌ఐ డి. వెంకటకృష్ణ సంఘటన ప్రాంతానికి చేరుకొని ప్రమాద వివరాలను నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
నారాకోడూరు వద్ద ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి తొమ్మిది మందికి గాయాలు ప్రమాదానికి పొగ మంచే కారణం
దూసుకొచ్చిన మృత్యువు
దూసుకొచ్చిన మృత్యువు
Comments
Please login to add a commentAdd a comment