వైస్ చైర్మన్ ఎన్నిక ముగిసింది
గురజాల ఆర్డీఓ మురళీ కృష్ణ
పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం ముగిసిందని గురజాల ఆర్డీఓ, ఎన్నికల అధికారి మురళీ కృష్ణ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. అనారోగ్యంతో మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి చెందటంతో ఖాళీ అయిన స్థానానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించటం జరిగిందన్నారు. ఈ ఎన్నికకు 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని కోరం సభ్యులందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. ఉన్నం భారతిని వైస్ చైర్మన్‌గా 28వ వార్డు కౌన్సిలర్ గర్నె నాగేశ్వరరావు ప్రతిపాదించగా, 20వ వార్డు కౌన్సిలర్ కొత్త తులసీ సౌజన్య బలపరచటం జరిగిందన్నారు. హాజరైన కౌన్సిలర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో ఎన్నిక సజావుగా జరిగిందన్నారు. ఉన్నం భారతికి నియామక పత్రాలను అందజేశామన్నారు. మొత్తం 33 మందికి గాను కోరంకు సరిపడా 17 మంది కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారన్నారు. కోరం పూర్తి అయిన తర్వాత ఈ ఎన్నికను నిర్వహించటం జరిగిందన్నారు. ఈ ఎన్నికకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ధనుంజయ్ అబ్జర్వర్‌గా వ్యవహరించారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
వైస్ చైర్మన్ ఎన్నిక ముగిసింది
Comments
Please login to add a commentAdd a comment