వెలుగు ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా ఏడు పథకాల నుంచి మహిళలకు రుణాలు మంజూరు చేస్తారు. ఇందులో సీ్త్రనిధి పథకం, గ్రామ సమైఖ్య సంఘాలకు ఇచ్చే కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, హ్యూమన్ డెవలప్‌మెంట్ ఫండ్, విలేజ్ రివాల్వింగ్ ఫండ్, పూరెస్ట్ ఆఫ్ ది ఫూర్ పథకం, అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం, రైతు కుటుంబాలకు రుణాలు ఇచ్చే ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్‌ల ద్వారా మహిళలు, రైతులు రుణాలు పొంది సబ్సిడీలు పోనూ మిగిలిన నగదు తిరిగి చెల్లించాల్సి ఉంది. గత రెండేళ్లుగా వెలుగు కార్యకలాపాల్లో ఎటువంటి రాజకీయ జోక్యం లేకపోయినా పూర్తిస్థాయిలో అవినీతి పెరిగిపోయింది. ఒక్క సీ్త్ర నిధి పథకంలోనే ప్రధానంగా అమరావతి, అచ్చంపేట, ఈపూరు మండలాల్లో సుమారు రూ.3కోట్లు నిధులు పక్కదారి పట్టి లెక్కలు తేలటం లేదంటే అవినీతి ఏ మేరకు జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలోని 25 మండలాల్లో రూ.13.5 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయంటే రికవరీ గురించి వెలుగు అధికారులు మర్చిపోయారనే చెప్పుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment