పంట పొలాల్లో చుక్కల జింక మృతి
నరసరావుపేట రూరల్: మండలంలోని యలమంద గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల్లో చుక్కల జింక మృతదేహాన్ని సోమవారం రైతులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
వేసవి ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో నీటి కోసం వచ్చి మృతి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామ పరిసరాల్లో సుబాబుల్ తోటలు అధికంగా ఉండటంతో అప్పడప్పుడు దారి తప్పి పొలాల్లోకి జింకలు వస్తుంటాయని, ఆ క్రమంలోనే వచ్చి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఆడ జింక కావటంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి గర్భిణో కాదో నిర్ధారించాల్సి ఉందని అటవీశాఖ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment