బడ్జెట్‌లో అంగన్‌వాడీలకు నిధులు కేటాయించాలి
సత్తెనపల్లి: బడ్జెట్‌లో అంగన్‌వాడీలకు నిధులు కేటాయించాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి డిమాండ్ చేశారు. పట్టణంలోని పుతుంబాక భవన్‌లో సోమవారం జరిగిన పల్నాడు జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమావేశానికి ఎస్.కె సుజాత అధ్యక్షత వహించారు. మల్లేశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్ అహల్య, పద్మ, భవాని, సీఐటీయు మండల కార్యదర్శి పెండ్యాల మహేష్, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అద్భుతమైనది హనుమత్ వైభవం
తెనాలి: హనుమత్ వైభవం చాలా గొప్పదని, వాస్తవానికి భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయస్వామిగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి(బాలస్వామి) అన్నారు. స్థానిక షరాఫ్‌బజారులోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని బాలస్వామి సోమవారం దర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. తన బాల్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంతో అనుబంధాన్ని గుర్తుచేశారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. హనుమంతుడి ధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జయాలు ఉంటాయని చెప్పారు. హనుమాన్ చాలీసా కూడా జయహనుమతోనే ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. మాఘమాసంతో సహా ఏ మాసంలో ఏరోజు ఏమేం చేయాలో? ధర్మ ఆచరణ విధివిధానాలను పెద్దలు చెప్పారనీ, ప్రజలు శాస్త్రప్రకారం ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుడిని ఆరాధిస్తూ తమ జీవనవిధానాన్ని ఆచరించాలని సూచించారు. బాలస్వామీజీకి ఆలయ ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, ప్రధాన అర్చకుడు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్‌వీ కిరణ్‌కుమార్ స్వాగతం పలికారు. స్వామీజీతో సాలిగ్రామ మఠం కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య పాల్గొన్నారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
చీరాల రూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన సోమవారం చీరాల రైల్వే స్టేషన్ ఫైరాఫీసు గేటు సమీపంలోని వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. ఫైరాఫీసు గేటు సమీపంలో వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో ప్రమాద స్థలాన్ని పరిశీలించగా మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉండవచ్చని, మృతదేహంపై బ్లాక్ కలర్ చొక్కా, గళ్ల లుంగీ ఉందని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ ఎస్సై 94406 27646 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
బడ్జెట్‌లో అంగన్‌వాడీలకు నిధులు కేటాయించాలి
బడ్జెట్‌లో అంగన్‌వాడీలకు నిధులు కేటాయించాలి
Comments
Please login to add a commentAdd a comment