రైతు కళ్లు చెమిర్చి..
మిర్చి రైతుకు ప్రభుత్వ ‘మద్దతు’ శూన్యం
సాక్షి, నరసరావుపేట: ఎర్ర బంగారంగా పిలిచే మిర్చి సాగుతో లాభాల పంట పండుతుందని సాగుచేసిన రైతుల పరిస్థతి అగమ్యగోచరంగా మారింది. గతేడాది మిర్చి రైతులకు మంచి దిగుబడులు రావడంతోపాటు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలవడంతో అధిక ధరలు లభించడంతో లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఆశగా ఈ ఏడాది మిర్చి సాగుచేసిన రైతులకు ఓవైపు ప్రకృతి మరోవైపు ప్రభుత్వం సహకరించకపోవడంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లారు. లాభాల మాట దేవుడెరుగు కనీసం పెట్టిన పెట్టుబడైనా వస్తే చాలని రైతులు కోరుకుంటుండగా, పరిస్థితి మాత్రం కనీసం కూలీలకు అయిన ఖర్చు కూడా రాని దుస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ దశలో ప్రభుత్వమైనా అండగా నిలిచి మద్దతు ధర లభించేలా చూస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. తీవ్ర నిరాశలో ఉన్న మిర్చి రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు గుంటూరు మిర్చి యార్డుకు రానున్నారు. రైతన్నల తరఫున ప్రభుత్వానికి వారు పడుతున్న కష్టాలను వివరించి, న్యాయం చేసేలా ఒత్తిడి చేయనున్నారు.
పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 40,127 హెక్టార్లలో, రబీలో మరో 3,082 హెక్టార్లలో మిర్చి పంట సాగుచేశారు. ఇందులో ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు కోతలకు వచ్చాయి. మిగిలిన పంటలతో పోల్చితే మిర్చి పంటకు పెట్టుబడి అధికం. అయితే దిగుబడి, ధర మంచిగా ఉంటే అధిక లాభాలు వస్తాయన్న ఆశతో రైతులు అప్పులు చేసి మరీ సాగు చేస్తారు. గతంతో పోల్చితే రైతులు అవసరం లేకపోయినా ఎరువులు, పిచికారీ మందుల వాడకం అధికమైంది. దీంతో ఎకరా మిర్చి పంటకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు పెట్టుబడి అవుతోంది. కౌలు రైతులయితే భూమి కౌలు మరో రూ.20–30 వేలు అధికంగా ఖర్చు కానుంది.
సాగులో ఉన్న మిరప పైరు
ఆత్మహత్యే శరణ్యం
మిర్చికి ఇదే విధంగా ధర ఉంటే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. గత ఏడాది రూ.20వేలు పలికిన ధర ఈ ఏడాది రూ.13 వేలు కూడా రావడం లేదు. దిగుబడులు కూడా ఎకరాకు 10–15 క్వింటాళ్లు మించి వచ్చేలా కనిపించడం లేదు. నల్లి తెగులు నివారణ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఏ రకంగా చూసుకున్నా రైతులు ఆర్థికంగా నష్టాలు తప్పేలా లేవు. ఽగత ఏడాది ఉన్న ధర కల్పిస్తే రైతులు కొంత వరకు నష్టాల నుంచి బయటపడతారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం
–నాగేశ్వరరావు, దుర్గి, మాచర్ల నియోజకవర్గం
మిర్చి పంటకు ఖరీఫ్ సాగులో ఉన్నట్టుండి బొబ్బర తెగులు రావడంతో మొక్క ఎదుగుదల ఆగిపోయింది. ఇప్పటికే ఉన్న పూత, పిందె అర్ధంతరంగా రాలిపోయింది. దిగుబడి సాధారణంగా 30 క్వింటాళ్ల వరకు ఉండగా బొబ్బర వచ్చిన తోటల్లో 10 క్వింటాళ్లు సైతం కష్టమని రైతులు భావిస్తున్నారు. గతంలో మిర్చి ధరలు రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.10వేలు నుంచి రూ.12 వేలు మాత్రమే ఉంది. దీంతో పండిన అరకొర మిర్చిని కూలీలతో తీసి విక్రయిస్తే కనీసం కూలి, రవాణా ఖర్చులు సైతం రావని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొంతమంది రైతులు పంటలను వదిలేస్తున్నారు. మిర్చి ధర గతేడాదితో పోల్చితే క్వింటాకు ఏకంగా రూ.8 వేల నుంచి రూ.6 వేల వరకు తగ్గిపోయినా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన రావడంలేదు. రైతులకు మద్దతు ధర లభించేలా కూటమి సర్కారు నుంచి ఎటువంటి చర్యలు లేవు.
దారుణంగా పతనమైన ధరలు గతేడాది క్వింటా మిర్చి ధర రూ.20 వేలు – రూ.24 వేలు ప్రస్తుతం రూ.10 వేలు కూడా దక్కని వైనం పెరిగిన చీడపీడలు.. తగ్గిన దిగుబడి భారీగా నష్టపోతున్న రైతులు పట్టించుకోని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు నేడు గుంటూరు మిర్చి యార్డులోవైఎస్ జగన్ పర్యటన
పెట్టుబడి కూడా రాని దుస్థితి...
పట్టించుకోని ప్రభుత్వం
రైతు కళ్లు చెమిర్చి..
రైతు కళ్లు చెమిర్చి..
Comments
Please login to add a commentAdd a comment