వేసవిలోనూ కొనసాగు | - | Sakshi
Sakshi News home page

వేసవిలోనూ కొనసాగు

Published Wed, Feb 19 2025 1:32 AM | Last Updated on Wed, Feb 19 2025 1:29 AM

వేసవి

వేసవిలోనూ కొనసాగు

అనేక లాభాలు

రానున్న ఖరీఫ్‌లో ప్రధాన పంటలు సాగు చేసే రైతులు, రబీ సీజన్‌ పూర్తి చేసుకున్న రైతులు తమ పొలాల్ని ఖాళీ ఉంచకుండా పీఎండీఎస్‌కు సిద్ధంకండి. ఈ సాగు వల్ల ప్రధాన పంటలకు మేలు జరుగుతుంది. జిల్లాలో ఈఏడాది 80వేల ఎకరాల సాగు లక్ష్యం చేసుకున్నాం.

– కె.అమలకుమారి,

డీపీఎం, ప్రకృతి విభాగం పల్నాడు

అధిక దిగుబడులు...

ఆరేళ్లుగా ప్రకృతి విధానంలో పది ఎకరాల్లో అన్ని రకాల పంటల్ని సాగు చేస్తున్నాను. ఏటా పీఎండీఎస్‌ విధిగా చేయడంతో పంట నాణ్యత, దిగుబడి పెరిగాయి. మిర్చి కేజీ రూ.600 విక్రయించిన సందర్భాలు ఉన్నాయి.

– డి.శేషారావు, రైతు, పెదకూరపాడు

యడ్లపాడు: పీఎండీఎస్‌(ప్రీ మాన్‌సూన్‌్‌ డ్రై సోయింగ్‌) విధానాన్ని జిల్లాలో ప్రకృతి వ్యవసాయ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. రబీ ముగింపు నుంచి ఖరీఫ్‌ ప్రారంభం మధ్య కాలంలో ఈ విధానాన్ని అనుసరించి వివిధ రకాల విత్తనాలతో పంటలను సాగు చేస్తారు. ఖరీఫ్‌, రబీ కాలాల్లోనే కాకుండా ఆ మధ్యలో వచ్చే వేసవిలో పొలాలు ఖాళీగా ఉంచకుండా సాగు చేయడంతో భూమి 365 రోజులు కప్పబడి ఉంటుంది. ఇది నేల నాణ్యతను మెరుగుపరిచే ప్రధాన విధానం. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఈ విధానం ద్వారా 80 వేల ఎకరాల్లో పంట సాగే లక్ష్యంగా ప్రకృతి అధికారులు కృషి చేస్తున్నారు.

నీటి నిల్వ సామర్థ్యం పెంపు..

ఇది తొలుత నవధాన్యాలైన 9 రకాల విత్తనాలతో ప్రారంభించారు. మంచి ఫలితాలు రావడంతో 18 రకాలుగా పెంచారు. ప్రస్తుతం 30 రకాల విత్తనాలను కలిపి పీఎండీఎస్‌ సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానంతో భూమిలో సూక్ష్మజీవులు వద్ధి చెందుతాయి. నేల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రధానంగా నేలలో కర్బనశాతం మెండవుతుంది. ఇది చీడపీడలను, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని పెంచుతుంది.

పీఎండీఎస్‌ కిట్‌ ఇదీ

పీఎండీఎస్‌ విధానంలో పప్పుజాతి, నూనెజాతి, ధాన్యపు జాతి, సుగంధ ద్రవ్యాలు, పచ్చిరొట్ట, ఆకుకూరలు, కూరగాయ రకాలైన తీగజాతి, దుంపజాతి వంటి 30 రకాల విత్తనాలను కలిపి ఒక కిట్‌గా తయారు చేస్తారు. ఈ కిట్‌ను ఎకరాకు విత్తుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందులో బొబ్బర్లు, చిక్కుడు, మినుము, పెసర, నువ్వులు, ఆముదం, వేరుశెనగ, ధనియాలు, మెంతులు, రాగులు, మొక్కజొన్న, సామలు, కొరల్రు, జీలుగ, పిల్లిపెసర వంటి పలు రకాల విత్తనాలు ఉంటాయి.

విత్తన సంరక్షణ

వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నా వర్షాలు కురవకపోయినా పీఎండీఎస్‌ విధానంలో విత్తనాలను సంరక్షించుకోవచ్చు. విత్తనాలను బీజామృతం, బంకమన్ను, ఘనజీవామృతం, బూడిదతో మూడు రకాల కోటింగ్‌ చేయాలి. ఇది చీడపీడల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎలుకలు, ఇతర చీడపీడల నుంచి రక్షణ లభిస్తుంది. చిన్నపాటి వర్షం వచ్చినా ఈ విత్తనాలు మొలకెత్తుతాయి.

ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ విధానంతో నేలకు, పైరుకు మేలు 30 రకాల విత్తనాలతో వైవిధ్య సాగు రబీ – ఖరీఫ్‌ సీజన్ల నడుమ సాగుకు సిద్ధం చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అధికారులు

పీఎండీఎస్‌ వల్ల లాభాలు

నేల గుల్లబారటం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి

నీటి నిల్వ సామర్థ్యం మెరుగవుతుంది

ప్రధానంగా నేలలో కర్బన శాతంపెరుగుదల

ఫలితంగా పంటకు చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకునే శక్తి సామర్థ్యం

నేల ఉత్పాదక శక్తి లభించి అధిక దిగుబడులు సాధన

పీఎండీఎస్‌ పంట పశువుల పచ్చిమేతకు వాడుకోవచ్చు

తద్వారా పాడిఖర్చు తగ్గించుకోవచ్చు

పిల్లిపెసర తదితర వాటిని అమ్మి అదనపు ఆదాయం పొందవచ్చు

No comments yet. Be the first to comment!
Add a comment
వేసవిలోనూ కొనసాగు 1
1/1

వేసవిలోనూ కొనసాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement