అమరేశ్వరుని సేవలో క్యాట్ న్యాయమూర్తి
అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుని మంగళవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) న్యాయమూర్తి లతా భరద్వాజ్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట క్యాట్ మెంబర్ వరణ్‌సింధు కౌముది, అధికారులు ఉన్నారు.
చింతపల్లి మేజర్‌కుసాగునీరు విడుదల
అచ్చంపేట: మండలంలోని కొండూరు పంచాయతీ పరిధిలోని శ్రీనివాసతండా వద్ద నాగార్జున సాగర్ కాలువల ద్వారా చింతపల్లి మేజర్‌కు సాగునీటి అవసరాలకు కెనాన్స్ ఏఈ చిల్కా భాస్కర్ ఆదేశాలతో మంగళవారం సాగునీటిని వదిలారు. చింతపల్లి మేజర్ కాలువ కింద ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలు వేశారు. ఈ కాలువకు నీళ్లు రాకపోవడంతో రైతులు గత కొద్దికాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచే కస్తల మేజర్‌కు సాగునీటిని వదిలిన అధికారులు చింతపల్లి మేజర్‌కు వదలకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు శ్రీనివాసతండా నుంచి ఐదు రోజులు కస్తల మేజర్‌కు, ఐదు రోజులు కస్తల మేజర్‌కు సాగునీటిని మార్చి మార్చి వదిలే విధంగా ఆదేశాలు జారీ చేశారు.
న్యాయ సేవాధికార సంస్థ సభ్యులకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేటటౌన్: మండల న్యాయసేవాధికార సంస్థ సభ్యుల నియామాకానికి ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని 138 మండల న్యాయ సేవాధికార సంస్థలలో సభ్యులుగా వ్యవహరించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నారు. అనుభవజ్ఞులైన సీనియర్ న్యాయవాదులు, సామాజిక సేవా కార్యకర్తలు, న్యాయ సేవలు ప్రజలకు అందించటంలో ఆసక్తిగల వారు ఈ నెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
కాలువలో కారు బోల్తా
అమర్తలూరు(వేమూరు): ఇంటూరు కాల్వలో కారు బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. అమర్తలూరు పోలీసుల కథనం మేరకు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగే శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఈక్రమంలో ఉదయం 6.30 నిమిషాలకు ఇంటూరు నుంచి చెరుకుపల్లి వెళ్లే దారిలో లారీని క్రాస్ చేస్తుండగా అదుపు తప్పి కారు ఇంటూరు కాల్వలో పడింది. అందులోఉన్న వారికి స్వల్ప గాయాలు కావడంతో చెరుకుపల్లిలో ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొంది, రేపల్లె వెళ్లినట్లు ఎస్‌ఐ జానకి అమర్ వర్థన్ తెలిపారు.
చిన్నతరహా నీటి వనరుల గణనకు సిద్ధం కండి
నరసరావుపేట: జిల్లాలో గ్రామస్థాయిలో చిన్ననీటి వనరులు, రెండో జలాశయాల గణన నిర్వహించాలని రాష్ట్ర అర్ధ గణాంకశాఖ విజయవాడ ఉపసంచాలకులు పి.శ్రీనివాస్, ఉప గణాంక అధికారి జి.రమేష్‌కుమార్ సంబంధిత అధికారులను కోరారు. మంగళవారం స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయంలో చిన్న తరహా నీటి వనరుల గణన కార్యాచరణలో భాగంగా సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణలో వారు అధికారులు పాల్గొన్నారు. ఇన్‌చార్జి జిల్లా గణాంక అధికారి పి.మాలతీదేవి, ఉప గణాంక అధికారి ఎం.కృష్ణకిషోర్, టి.సూర్యకుమారి పాల్గొన్నారు.
అమరేశ్వరుని సేవలో క్యాట్ న్యాయమూర్తి
Comments
Please login to add a commentAdd a comment