మిర్చి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు
ఈ ఏడాది మిర్చి రైతులకు అన్ని విధాలుగా దెబ్బలు తగులుతున్నాయి. నల్లి తెగులు కారణంగా పంట దిగుబడులు సగానికి తగ్గి, పెట్టుబడులు పెరిగాయి. పండిన పంటకై నా మంచి ధర ఉంటుందంటే అది కూడా క్వింటాకు రూ.7వేలు నుంచి రూ.10వేలు వరకు తగ్గిపోయింది. దీంతో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
– జి.చెంచయ్య, రైతు, గోనెపూడి, నరసరావుపేట రూరల్ మండలం
కూలి ఖర్చులు కూడా రావడం లేదు
నేను రెండు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాను. మొదటి కోత కోస్తే ఆరు క్వింటాళ్లు వచ్చింది. 170 మంది కూలీలు కోతకు పనిచేశారు. వీరికి కూలి రూ.400 చొప్పున రూ.68 వేలు అయింది. మిర్చి క్వింటాకు రూ.10వేలు చొప్పున విక్రయిస్తే ఆరు క్వింటాళ్లకు రూ.60వేలు వచ్చింది. పంటకు పెట్టిన పెట్టుబడుల సంగతి దెవుడెరుగు కనీసం మొదటి కోతకు కూలీల ఖర్చే రూ.8 వేలు చేతి నుంచి పడిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలి. –బి.శివరామయ్య, రైతు,
గోనెపూడి, నరసరావుపేట రూరల్ మండలం
మిర్చి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment