పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు మిర్చియార్డుకు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడంతోపాటు, రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వివరించారు. రైతులకు అండగా తానున్నాననే భరోసా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మిర్చియార్డుకు వైఎస్ జగన్ ఉదయం 9.30లకు చేరుకుంటారని, మిర్చిని అమ్ముకునేందుకు వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు.
కూటమి ప్రభుత్వం విఫలం
కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో సీఎం చంద్రబాబు రైతులకు ఒక్క మేలు అయినా చేశారా అని అంబటి ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో బాబు విఫలమయ్యారని విమర్శించారు. ధాన్యం బస్తా ధర రూ.1200 నుంచి 1300, మిర్చి క్వింటా ధర రూ. 13వేలు కంటే పలకడం లేదని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment