కేంద్ర పథకాల అమలు తీరుపై ఆరా
శావల్యాపురం: మండలంలోని శానంపూడి గ్రామంలో కేంద్ర టీం సభ్యులు పర్యటించి కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు పొందుతున్న లబ్ధిదారులను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామసచివాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో న్యూఢిల్లీ సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ మేనేజరు అండ్ కోఆర్డినేటరు వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రధానమంత్రి అవాస్ యోజన, స్వయ సహాయక సంఘూలు, పింఛన్లు పంపిణీ, గ్రామీణ సడక్ యోజన, గ్రామ స్వరాజ్య అభియాన్ తదితర పథకాల పురోగతిపై లబ్థిదారులను అడిగి తెలుసుకున్నారు. పథకాల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులున్నాయా, అర్హులకు అందుతున్నాయా తదితరవన్నీ క్షేత్రస్థాయిలో లబ్థిదారులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలో పర్యటించి ఆవాస్ యోజన పఽథకంలో నిర్మించిన నివాస గృహాలను పరిశీలించి లబ్థిదారులతో మాట్లాడి బిల్లులు గురించి ఆరా తీశారు.
ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో పర్యటించి పథకాల వారీగా లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆయనతో పాటు సర్పంచ్ మొనపాటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ చెన్నంశెట్టి రంగారావు, ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య, కేంద్ర టీం సభ్యులు వి.సంధ్యారాణి, లక్ష్మి, లోకేష్, జి.సంధ్యా, భానుచంద్ర, హౌసింగ్ డీఈ ఎన్.శ్రీనివాసరావు, ఏఈ రసూల్, పంచాయతీ కార్యదర్శి బాల పరమేశ్వర రావు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
శావల్యాపురంలో...
శావల్యాపురం: ఉపాధి పనులు పారదర్శకంగా జరిగేలా అధికారులు బాధ్యత వహించాలని న్యూఢిల్లీ కేంద్ర సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ అధికారి వికాస్ మల్కర్ అన్నారు. మంగళవారం మండలంలోని శానంపూడి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వ నిధులతో చేపడుతున్న ఉపాధి పనులు పేదలందరు సద్వినియోగం చేసుకొని మంచి ఆర్ధిక ప్రగతి సాధించాలన్నారు. కూలీలు చేస్తున్న పంట కాల్వ పనులను, మస్టర్‌ను పరిశీలించి ఉపాధి అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఏపీవో కె.రామారావు, డీఎఫ్‌టీ లావణ్య, ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
శానంపూడిలో పర్యటించిన కేంద్రం బృందం
కేంద్ర పథకాల అమలు తీరుపై ఆరా
Comments
Please login to add a commentAdd a comment