27న ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చని జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ షేక్.ఖాజావలి మంగళవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యాలు అనుమతివ్వాలని సూచించారు.
ప్రకృతి సేద్య ఖరీఫ్ కార్యాచరణపై అవగాహన కల్పించండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ప్రకృతి సేద్యం చేస్తున్న గ్రామ సంఘాల్లోని రైతులకు ఖరీఫ్ కార్యాచరణపై అవగాహన నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ చెప్పారు. కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశపు హాలులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఖరీఫ్ కార్యాచరణ అమలుకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, డీఆర్డీఏ శాఖలు ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ప్రగతి, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర బాబు, డీఆర్‌డీఏ పీడీ విజయ లక్ష్మి, జిల్లా పశు సంవర్ధక అధికారి నరసింహారావు మాట్లాడుతూ కార్యాచరణ విజయవంతానికి కృషి చేస్తామన్నారు. రైతులు వట్టిచెరుకూరు ధనుంజయ రావు, అత్తోట బాపయ్య, ఎరుకులపూడి విజయలక్ష్మి ప్రకృతి వ్యవసాయంలో తమ అనుభవాలను పంచుకున్నారు.
ఇఫ్కో కొత్త ఎరువు
మార్కెట్‌లోకి విడుదల
కొరిటెపాడు(గుంటూరు): ఇఫ్కో వారు నూతనంగా తయారు చేసిన 28ః28ః0 అనే కాంప్లెక్స్ ఎరువును జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు మంగళవారం గుంటూరు రూరల్ మండలం, రెడ్డిపాలెం గూడ్స్‌షెడ్ వద్ద మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా నున్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 28ః28ః0 ఇఫ్కో వారు తెప్పించడం ఆనందంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎరువుల విభాగం ఏడీఏ కేజేడీ రాజన్, గుంటూరు ఏడీఏ తోటకూర శ్రీనివాసరావు, డీసీఎంఎస్ జిల్లా బిజినెస్ మేనేజర్ డి.హరిగోపాలం, కొల్లిపర ఏఓ వెంకట్రావు, ఇఫ్కో జిల్లా మేనేజర్ రఘు తదితరులు పాల్గొన్నారు.
27న ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment