డాక్టర్‌ శరత్‌ చంద్రకుమార్‌ ఔదార్యం | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ శరత్‌ చంద్రకుమార్‌ ఔదార్యం

Published Thu, Feb 20 2025 9:00 AM | Last Updated on Thu, Feb 20 2025 8:55 AM

డాక్ట

డాక్టర్‌ శరత్‌ చంద్రకుమార్‌ ఔదార్యం

గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాల 1998 బ్యాచ్‌ విద్యార్థి, గుంటూరు చంద్ర కేర్‌ న్యూరో స్పెషాలిటీ అధినేత, ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ నలమోతు శరత్‌చంద్రకుమార్‌ తన తల్లి శైలజకుమారి జ్ఞాపకార్థం గుంటూరు వైద్య కళాశాలలో తారు రోడ్ల నిర్మాణానికి రూ. 6 లక్షలు అందజేశారు. ఈ విరాళంతో నిర్మించిన రోడ్లను బుధవారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకట సుందరాచారితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుందరాచారి శరత్‌చంద్రకుమార్‌ను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రభాకర్‌, డాక్టర్‌ శ్రీధర్‌, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నేడు, రేపు న్యాయవాదులు విధుల బహిష్కరణ

గుంటూరు బార్‌ ఫెడరేషన్‌

చైర్మన్‌ కాసు వెంకటరెడ్డి

గుంటూరు లీగల్‌ : న్యాయవాదుల అమెండ్‌మెంట్‌ బిల్లు –2025కు వ్యతిరేకంగా గుంటూరు బార్‌ ఫెడరేషన్‌ నిరసన తెలుపుతుందని ఫెడరేషన్‌ చైర్మన్‌ కాసు వెంకటరెడ్డి బుధవారం తెలిపారు. నిరసనలో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు గురు, శుక్రవారాల్లో విధులను బహిష్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

బ్లడ్‌ బ్యాంకు నుంచి

సురేష్‌కుమార్‌ తొలగింపు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ బ్లడ్‌బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ సురేష్‌కుమార్‌ను అక్కడి విధుల నుంచి తొలగించి ఇతర వార్డుకు మార్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశస్వి రమణ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ‘సాక్షి’ పత్రికలో ‘జీజీహెచ్‌లో జలగలు’ శీర్షకన ఈనెల 18న బ్లడ్‌బ్యాంక్‌లో జరుగుతున్న అవినీతిపై కథనం ప్రచురితమవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తక్షణమే ఆయన్ను బ్లడ్‌బ్యాంక్‌ నుంచి తొలగించి సూపరింటెండెంట్‌ కార్యాలయానికి రిఫర్‌ చేయాల్సిందిగా యశస్వి రమణ ఆదేశించారు. బ్లడ్‌ బ్యాంక్‌ ఇన్‌చార్జిగా డాక్టర్‌ ప్రియదర్శిని, డాక్టర్‌ జి.శివరామకృష్ణలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ ఎండీసీ ఎండీ సంతకంతో నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌

ఫిర్యాదు చేసిన కార్యాలయ సిబ్బంది

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ శుక్లా పేరుతో నకిలీ డిజిటల్‌ సంతకంతో అపాయింట్‌మెంట్‌ లెటర్‌ బయటపడినట్లు కార్యాలయం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ జయరాం తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తాడేపల్లి సీఐ కల్యాణ్‌ రాజ్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గత కొంత కాలంగా ఏపీ ఎండీసీ కార్యాలయానికి సంబంధించి డిజిటల్‌ సంతకంతో ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నట్లు ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

వీరమ్మతల్లీ...పాహిమాం...

ఉయ్యూరు: వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం భక్తజన కోలాహలంగా మారింది. శిడి బండి మహోత్సవం పూర్తవటంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు బుధవారం వేకువజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. మహిళలు పాలపొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. వీరమ్మతల్లీ...అమ్మా...పాహిమాం...అంటూ చల్లని తల్లికి పూజలు చేశారు. ఉయ్యూరు పాల వ్యాపారులు, వీరమ్మతల్లి ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు అమ్మవారికి ఊరేగింపుగా వెళ్లి పొట్టేళ్లను కానుకగా సమర్పించారు. వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ జంపాన పూర్ణిమ, కేపీస్‌ డెంటల్‌ ఆసుపత్రి చైర్మన్‌ దాడి కై లాష్‌కుమార్‌ దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డాక్టర్‌ శరత్‌ చంద్రకుమార్‌ ఔదార్యం 1
1/2

డాక్టర్‌ శరత్‌ చంద్రకుమార్‌ ఔదార్యం

డాక్టర్‌ శరత్‌ చంద్రకుమార్‌ ఔదార్యం 2
2/2

డాక్టర్‌ శరత్‌ చంద్రకుమార్‌ ఔదార్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement