సీడ్ యాక్సిస్ రోడ్డుపై పచ్చదనం పెంచాలి
అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీపార్థసారథి
తాడికొండ: అమరావతి రాజధానికి వెళ్లే సీడ్ యాక్సిస్ రోడ్డుపై పచ్చదనం పెంచాలని అమరావతి అభివృద్ది సంస్థ (ఏడీసీ) చైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు సూచనలు చేశారు. అనంతరం ఎన్–9 రోడ్డుపై బఫర్ జోన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఆమె వెంట ఏడీసీ జనరల్ మేనేజర్ కె శ్రీ హరిరావు, చీఫ్ ఇంజినీర్ ఎం ప్రభాకరరావు, ఉద్యాన విభాగాధిపతి విఎస్ ధర్మజ పాల్గొన్నారు.
ఎన్జీరంగా వర్సిటీని సందర్శించిన అమెరికా ప్రొఫెసర్
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం ఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆమెరికా వ్యవసాయ విద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య ఎంఎస్ రెడ్డి బుధవారం సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులతో ముఖాముఖీ చర్చల్లో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ మన భవిష్యత్తును కాపాడుకునేందుకు మొక్కలు, నేలల ఆరోగ్యం కాపాడుకోవటంలో ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న సమస్యలను, ఎలా అధిగమించాలి అనే అంశాలపై ఆయనతో చర్చించారు. విదేశాల్లో చేసిన వ్యవసాయ పరిశోధనలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ప్రొఫెసర్ ఎంఎస్ రెడ్డి వివరించారు. వ్యవసాయ విద్యార్థులకు వ్యవసాయం, వాటి మెలకువలను వివరించారు. అనంతనం విశ్వవిద్యాలయం అధికారులు ఎంఎస్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీవారి తిరు కల్యాణం.. రమణీయం
రేపల్లె రూరల్: పట్టణంలోని ఉప్పూడి రోడ్డులో గల శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా లక్ష్మి, గోదా సమేత వేంకటేశ్వరులకు మంగళస్నానాలు చేయించి, వధూవరులుగా అలంకరించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడమ కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తిరు కల్యాణ వేడుకలను తిలకించి, స్వామికి మొక్కుబడులు చెల్లించుకున్నారు.
సీడ్ యాక్సిస్ రోడ్డుపై పచ్చదనం పెంచాలి
సీడ్ యాక్సిస్ రోడ్డుపై పచ్చదనం పెంచాలి
Comments
Please login to add a commentAdd a comment