అల్లుడి చేతిలో మామ హతం
క్రోసూరు: మండలంలోని పీసపాడు పరిధిలో పొలాల్లో మామ అల్లుడికి జరిగిన ఘర్షణలో అల్లుడు కర్రతో దాడి చేయటంతో మామ మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగేంద్రరావు తెలిపిన సమాచారం మేరకు సత్తెనపల్లి మండలం దీపాల దిన్నెపాలెంకు చెందిన పిల్లకతువుల గంగయ్య(గంగారాం)కు అచ్చంపేట మండలం కొండూరుకు చెందిన గంగమ్మతో ఏడు నెలల క్రితం వివాహమైంది. భార్యభర్తలు ఇరువురు తరచు ఘర్షణలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మండలంలోని పీసపాడు శివారు పొలాల్లో జీవాలు మేపుకొంటున్న గంగారం, భార్య గంగమ్మకు ఘర్షణ జరగ్గా.. జరిగిన విషయాన్ని గంగమ్మ తన తండ్రి బత్తుల గంగయ్యకు, సోదరుడికి తెలియచేసింది. వారు అక్కడికి చేరుకుని గంగారంను మందలించబోయారు. దీంతో కోపోద్రిక్తుడైన గంగారం మామను కర్రతో కొట్టటంతో తలకు దెబ్బతగలటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడకు చేరుకున్న కొద్దిసేపటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment