ముగిసిన ఎడ్ల బండలాగుడు పోటీలు
సీనియర్స్ విభాగంలో నంద్యాల, సూర్యాపేటలకు చెందిన సంయుక్త ఎడ్ల జతకు ప్రథమస్థానం
రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 96వ జయంతి ఉత్సవాల సందర్భంగా జాతీయస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు బుధవారంతో ముగిశాయి. సీనియర్స్ విభాగంలో పోటీలు రసవత్తరంగా జరిగాయి. రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విభాగంలో నంద్యాల జిల్లా పెదకొట్లాలకు చెందిన బోరిరెడ్డి కేశవరెడ్డి, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సురేంద్రరెడ్డిల సంయుక్త ఎడ్ల జత 2843 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. నంద్యాల జిల్లా సిరిసిల్ల మండలం గుంపరమానుదెన్నె గ్రామానికి చెందిన కుందూరు రామ్‌గోపాల్‌రెడ్డి ఎడ్ల జత 2334 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన కటికం లక్ష్మణ్‌కుమార్, మట్టంపల్లి గ్రామానికి చెందిన సృజినారెడ్డి, శ్రీధర్‌రెడ్డిల ఎడ్ల జత 2212 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన మేక కృష్ణమోహన్ ఎడ్ల జత 2118 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానం, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణాచౌదరిలకు చెందిన ఎడ్లజతల 2000 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం సాధించాయి. ఎడ్ల యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు, షీల్డ్‌లను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment