ఏపీఐఐసీ భూముల పరిశీలన
నరసరావుపేట రూరల్: మండలంలోని కేసానుపల్లి సమీపంలోని ఏపీఐఐసీ భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఆర్డీఓ మధులతలు గురువారం పరిశీలించారు. నరసరావుపేట నియోజకవర్గానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం అధికారులు ఈ భూముల పరశీలన జరిపారు. ఈ భూములను గత ప్రభుత్వ హాయాంలో ఆటోనగర్‌కు కేటాయించిన విషయం విధితమే. ఆటోనగర్ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. ఆటోనగర్‌కు కేటాయించగా మిగిలిన భూముల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం రొంపిచర్లలో ఏర్పాటుచేయాలని మొదట భావించారు. తాజాగా కేసానుపల్లిలోని ఆటోనగర్‌కు కేటాయించిన భూములను కూడా పరిగణలోకి తీసుకొన్నారు. ఈ భూముల పై నుంచి హైటెన్షన్ వైర్లు వెళ్లడం, ప్రధాన రోడ్డుకు కిలోన్నర మీటరు దూరం ఉండటం వంటి వాటిని అధికారులు గుర్తించారు. దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment