ఎన్టీఆర్ వైద్యసేవ ఉద్యోగులకు న్యాయం చేయాలి
ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 17, 24 తేదీల్లో విధుల బహిష్కరణ
వినుకొండ: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 17, 24 తేదీల్లో రాష్ట్రం మొత్తం విధులు బహిష్కరిస్తున్నామని ఏపీ వైద్యసేవ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్‌టీఆర్‌వీఎస్ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తుందని, ఆప్కాస్ రద్దు దిశగా ఇప్పటికే అడుగులేసిన ప్రభుత్వం ఏప్రిల్ నుంచి బీమా సేవలు కొనసాగుతాయని తెలిజేసిందన్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో గత 17 సంవత్సరాలుగా ప్రజలకు ఉచిత సేవలందించడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బంది ప్రభుత్వాల నుంచి ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నారన్నారు. ఇప్పటికై నా సమస్యలను నెరవేర్చాలని భవిష్యత్ పోరాటానికి సిద్ధమయ్యామని తెలియజేశారు. రాష్ట్ర నాయకులు మాచర్ల బుజ్జి, కాకాని అప్పారావు, జిల్లా నాయకులు సింగంశెట్టి వెంకటేశ్వర్లు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment