లైంగిక దాడుల నివారణపై అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం సమావేశ మందిరంలో పిల్లలపై లైంగిక దాడులను నివారించడంపై డీఈవోలు, ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటెక్షన్, ఎంఈఓలు ప్రోగ్రాం ఆఫీసర్స్, డిజేబుల్ వెల్ఫేర్ శాఖ, ఆర్‌బీఎస్‌కే సిబ్బందికి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎదిగే వయసులో ఉన్న పిల్లలతో కొంత సమయం కేటాయించాలన్నారు. స్నేహపూరితమైన వాతావరణంలో వారితో అన్ని సమస్యలు చర్చించాలన్నారు. పిల్లలు అన్ని విషయాలు పంచుకుంటారని, తద్వారా , వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కార మార్గాలు చెప్పడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ టి.ఓ.టి, ఆర్. సుప్రజ, సైకాలజిస్ట్ విజయకుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయలక్ష్మీ, పిడి ఐసిడిఎస్, తెనాలి, గుంటూరు డెప్యూటీ డీఈవోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ శ్రావణ్ బాబు, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ ప్రియాంక, పీడియాట్రిస్ట్ పి.నాగ శిరీష పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment