అలరించిన వీవీఐటీ రంగస్థల వేడుక
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలో నిర్వహించిన థియేటర్స్ డే వేడుక వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ వినోదం, విజ్ఞానం మేళవింపుతో వీవీఐటీ కార్యక్రమానికి వర్ధమాన నటుడు, రంగస్థల యువ దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ నందీపురస్కార గ్రహీత రౌతు వాసుదేవరావు న్యాయ నిర్ణేతగా వ్యవహరించగా విజేతలకు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ బహుమతులు అందజేశారు. ఈఈఈ విద్యార్థులు రూపొందించిన ‘అవును మా నాన్న రైతే‘ ప్రథమ బహుమతి అందుకోగా, మెకానికల్ విద్యా ర్థులు ప్రదర్శించిన ‘పుష్పవల్లి నిలయం ద్వితీయ బహుమతి అందుకుంది. ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్స్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, అడ్మిన్ డీన్ డాక్టర్ ఎన్.కుమారస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment