రైతులను భాగస్వాములను చేయాలి
రైతు సాధికారిత సంస్థ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళికలో రైతులను భాగస్వాములను చేయాలని రైతు సాధికారిత సంస్ధ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి వార్షిక కార్యచరణ ప్రణాళికపై శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి జూమ్ కాల్ ద్వారా హాజరైన విజయకుమార్ మాట్లాడుతూ రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలుగుతుందని తెలిపారు. వాతావరణం కూడా అత్యవసరస్థితిని ఎదుర్కుంటుందని చెప్పారు. ఖరీఫ్ వార్షిక ప్రణాళిక, సార్వత్రిక సూత్రాలు, పలు జిల్లాల్లో వ్యవసాయ విధానాలు, రైతులు పండిస్తున్న ఏ గ్రేడ్, ఏటీఎం మోడల్‌లో పండిస్తున్న పంటలు, రైతుల విజయ గాథలను వివరించారు. డీపీఎం అమలకుమారి మాట్లాడుతూ వ్యవసాయ, డీఆర్‌డీఏ, ఉపాధి హామీ, సెరీకల్చర్, హార్టీకల్చర్ తదితర శాఖల సమన్వయంతో కలిసి ప్రణాళికలను తయారు చేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో ర్యాలీలు, గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. నవధాన్యాలు సాగుభూమికి ఎంత మేలు చేస్తాయో వివరించారు. రైతులంతా పీఎండీఎస్ పద్ధతిని అవలంబించి సాగు చేయాలని సూచించారు. 30 రకాల విత్తన పద్ధతిని పాటిస్తే భూములు సారవంతమవుతాయని తెలిపారు. భూమి సంవత్సరమంతా పచ్చగా ఉంటే జీవ వైవిధ్యం పెరిగి భూమి సారవంతమై, చీడపీడల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజు, రాష్ట్ర శిక్షకురాలు శాంతి, జిల్లా శిక్షకుడు సైదయ్య, ఎన్‌ఎఫ్‌ఏలు నందకుమార్, అప్పలరాజు, సౌజన్య, మేరి, స్వాతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment