రేషన్ బియ్యం మూటలు స్వాధీనం
తాడికొండ: తాడికొండ మండలం నిడుముక్కలలో అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 16 రేషన్ బియ్యం మూటలను గురువారం అర్ధరాత్రి పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిడుముక్కల దర్గాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఈ మూటలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూటలను రేషన్ షాప్ నంబర్ 12కు అప్పగించినట్లు రెవెన్యూ ఆర్‌ఐ హనుమంతరావు వెల్లడించారు.
మాణిక్యవేల్‌కు నివాళి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): ట్రిపుల్ ఎక్స్ సోప్ అధినేత డాక్టర్ అరుణాచలం మాణిక్యవేల్ (77) అంతిక్రియుల శుక్రవారం జరిగాయి. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అరండల్‌పేట 10/2వ అడ్డరోడ్డులోని ఆయన నివాస గృహంలో సందర్శకుల సందర్శనార్థం ఉంచారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి (పశ్చిమ), నసీర్ అహ్మద్ (తూర్పు), ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో పాటు ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాణిక్యవేల్ అంత్యక్రియలుకొరిటెపాడులోని శశ్మాన వాటికలో జరిగాయి. కుటుంబ సభ్యులు, ట్రిపుల్ ఎక్స్ సోప్ ఉద్యోగు, సిబ్బంది పెద్దఎత్తున తరలివెళ్లారు.
రేషన్ బియ్యం మూటలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment